Tuesday, May 28, 2024

Exclusive

Tillu Square : టిల్లుగాడి మానియానా మజాకా, రెండో రోజు ఎన్ని కోట్లంటే..?

Tillu Square Day 2 Collections: టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ మాములుగా లేదు.తొలి రోజు 23.7 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో రోజూ కూడా అదే దూకుడుని కొనసాగిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కెద్దాం.

టాలీవుడ్‌ స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ నటి అనుపమ పరమేశ్వరన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా మూవీ టిల్లు స్క్వేర్‌. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మల్లిక్‌ రామ్‌ తెరకెక్కించిన ఈ మూవీ తొలిరోజు 23.7 కోట్ల వసూళ్లను రాబట్టగా..అదే ఊపులో రెండో రోజు కూడా టిల్లుగాడు అదే ర్యాంప్‌ని కంటిన్యూ చేస్తున్నాడు.

Read More: సుహాస్ మూవీ పోస్టర్‌ మామూలుగా లేదుగా..

ఈ మూవీ రెండురోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.45.3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రూ.50 కోట్ల క్లబ్‌ వైపుగా దూసుకువెళ్తుంది.రెండవ రోజు కూడా టిల్లు స్క్వేర్ రూ.20 కోట్లకి పైగా వసూళ్లు సాధించడం విశేషం. ఇక ఈ ఆదివారం కూడా కలెక్షన్ల సునామీని భారీగానే ఉండే ఛాన్స్‌ ఉంది. తొలిరోజు సినిమా బడ్జెట్‌లో 50 శాతం రికవరీ చేసిన టిల్లుగాడు రెండో రోజుతో మొత్తం ఆ బడ్జెట్‌ని ఊడ్చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఈ మూవీ బడ్జెట్‌ మొత్తాన్ని రెండు రోజుల్లోనే రికవరీ చేశారన్నమాట. అయితే ఈ మూవీ ఖచ్చితంగా రూ.100 కోట్లు కలెక్ట్‌ చేస్తుందని నిర్మాత నాగవంశీ చాలా ధీమాగా ముందే చెప్పారు. ఇప్పుడు టిల్లుగాడి వేగానికి త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‌ని కొల్లగొట్టేలా కనిపిస్తోంది.

ఇక ఈ మూవీలో నేహాశెట్టి కూడా క్యామియోలో కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. అలానే సిద్దు తండ్రి పాత్రలో మురళీధర్‌ గౌడ్‌ మరోసారి ఇరగదీశాడనే చెప్పాలి.ఇక మురళీ శర్మ, ప్రిన్స్ కీలక పాత్రల్లో మెప్పించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, పార్చున్‌ ఫోర్ మూవీలు కలిసి ఈ మూవీని నిర్మించాయి. భీమ్స్‌ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు ఇచ్చారు. ఇక ఈ మూవీలో టిల్లు చెప్పిన వన్ లైనర్స్‌, రిఫరెన్స్‌లు థియేటర్లలో టపాసుల్లో పేలాయి. ఇక తనదైన డైలాగ్‌ డెలివరీ, మాడ్యులేషన్, ఎక్స్‌ప్రెషన్‌తో సిద్దూ మరోసారి మ్యాజిక్ చేశాడు.

Publisher : Swetcha Daily

Latest

Hyderabad:బిల్డర్ మధు హత్యకు అసలు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Don't miss

Hyderabad:బిల్డర్ మధు హత్యకు అసలు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam highlites: సినిమా ఇండస్ట్రీలో పదేళ్లకు పైగా ఉంటూ చిన్న పాత్రలనుంచి హీరోయిన్ దాకా ఎదిగిన నటి ఐశ్వర్య మీనన్. తెలుగులో సిద్ధార్థ్...

Kamakshi Bhaskarla:‘నగ్న’సత్యం చెబుతోంది

Kamakshi Bhaskarla decide to act naked if character or situation demanded: తెలుగు సినిమా రంగంలో కామాక్షి భాస్కర్ల ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది. ఇట్లు మారేడుమిల్లి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ...

Movie Updates: ఇద్దరమ్మాయిలతో రచ్చ చేయనున్న హీరో శింబు

Simbu Is The Hero Who Will Make A Fuss With Two Girls: కొన్నాళ్ళు వరుస ప్లాపులతో డీలాపడ్డ కోలీవుడ్ స్టార్ హీరో శింబు మనాడు బ్లాక్ బస్టర్‌ మూవీతో...