Tollywood Hero Suhas Latest Movie Updates
Cinema

Suhas Movie Poster : సుహాస్ మూవీ పోస్టర్‌ మామూలుగా లేదుగా..

Tollywood Hero Suhas Latest Movie Updates : డిఫరెంట్ కాన్సెప్ట్‌ స్టోరీలను ఎంచుకొని లైనప్ చేసుకుంటూ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు యంగ్ హీరో సుహాస్. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ స్పెషల్‌ ఐడెంటీటీని సంపాదించుకున్నాడు. చాలావరకు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసి తన యాక్టింగ్‌తో అదరహో అనిపించుకొని ఆడియెన్స్‌ని అలరించాడు. అంతేకాకుండా ఎలాంటి రోల్‌ అయినా సరే ఇట్టే జీవించేస్తాడు. అయితే సైడ్ క్యారెక్టర్ల నుంచి అతడు హీరోగా పరిచయమయ్యాడు. 2020, అక్టోబరు 23న విడుదలైన మూవీ కలర్‌ ఫోటో. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వచ్చిన ఈ మూవీతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఆపై రైటర్ పద్మభూషణ్ సినిమా చేసి మరొక సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో పాపులర్ మిడిల్ రేంజ్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్‌గా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు సినిమా చేశాడు.ఈ మూవీ కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే జోష్‌లో మరికొన్ని సినిమాలను సుహాస్ తన లైన‌ప్‌లో పెట్టాడు. అందులో శ్రీరంగనీతులు మూవీ ఒకటి. సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహాని శర్మ కలిసి నటిస్తోన్న ఈ మూవీ నుంచి ఇటీవల సాంగ్, ట్రైలర్ రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

Read Also: నటుడు డేనియల్ హఠాన్మరణం, శోకసంద్రంలో ఇండస్ట్రీ

ప్రవీణ కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమానే కాదండోయ్ మరో సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తన లైనప్‌ ఉన్న మరో మూవీ ప్రసన్న వదనం. ఈ మూవీ టీజర్‌ని ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అర్జున్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశిసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇన్ని మూవీలను తన లైనప్‌ ఉంచుకుని సుహాస్ మరొక సినిమాను ప్రకటించేశాడు.

ఇక ఇన్ని మూవీలను తన లైనప్‌ ఉంచుకుని సుహాస్ మరొక సినిమాను ప్రకటించేశాడు. ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా ఇవాళ సుహాస్ నటించబోయే కొత్త సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ఈ చిత్రానికి గానూ ఓ భామ అయ్యో రామ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి రామ్ గోదల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సుహాస్‌కు జోడీగా మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే జో సినిమాలో నటించి అదరగొట్టిన మళవిక మనోజ్ ఇప్పుడు ఈ మూవీలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ షూటింగ్‌ త్వరలో స్టార్ట్ కాబోతున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు.