Salmankhan Shooting Incident Accused Identity Police Vehicle Missing
Cinema

Bollywood News: సల్మాన్ ఖాన్‌ ఇంటిబయట కాల్పులు, నిందితుడి గుర్తింపు

Salmankhan Shooting Incident Accused Identity Police Vehicle Missing: ఆదివారం తెల్లవారుజామున బాలీవుడ్‌ హీరో కండల వీరుడు సల్మాన్‌ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన ఘటనపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హీరో సల్మాన్ ఖాన్‌ ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు గుర్తించారు.

లారెన్స్ బిష్ఱోయ్ గ్యాంగ్‌కి చెందిన వ్యక్తి అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ పుటేజీలో కనిపిస్తున్న యువకుడు విశాల్‌ రాహుల్‌ అని పోలీసులు చెబుతున్నారు. యువకుడు 10వ తరగతి వరకు చదువుకున్నాడని, అతనిపై ఇప్పటికే ఐదుకు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. సల్మాన్ ఖాన్ ఇంటికి కిలోమీటర్‌ దూరంలో ఓ మోటార్ సైకిల్‌ని స్వాధీనం చేసుకున్నామని , దాడికి పాల్పడిన వ్యక్తులు దానిని ఉపయోగించినట్టు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటన టైంలో సల్మాన్ ఇంటిముందు ఉండే ఓ పోలీస్ వాహనం ఆదివారం ఉదయం కాల్పులు జరిపే సమయంలో అక్కడ లేదని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దీనిపై కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ కేసును ప్రస్తుతం ముంబై క్రైం బ్రాంచ్‌ దర్యాప్తు చేస్తుండగా.. ఏటీఎస్‌, ఎన్‌ఐఏ అధికారులు కూడా ఈ ఘటనపై సమాచారం తెలుసుకుంటున్నారు.

Also Read:పర్సనల్ పెళ్లిపై మండిపడుతున్న నటి తాప్సీ..

కాల్పుల తర్వాత ఘటనా స్థలంలో ఐదు ఖాళీ షెల్స్, ఒక బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఖాళీ షెల్ సల్మాన్ ఇంటి బాల్కనీలో గుర్తించగా.. ఆ టైంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు కోసం 15 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్ తర్వాత కరుడుగట్టిన నేరస్థుడు గ్యాంగ్‌స్టర్‌ గోదార షూటర్. లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్‌తో రోహిత్‌కి సంబంధం ఉంది. సల్మాన్ ఖాన్‌ ఇంటికి సంబంధించిన కేసులో షూటర్లు హర్యానాతో ముడిపడి ఉండటంతో హర్యానా పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో కూడా సల్మాన్ ఖాన్‌ను చాలాసార్లు దెబ్బతీసేందుకు పలువురు ట్రై చేశారు. మార్చి 2023లో సల్మాన్ కార్యాలయానికి బెదిరింపు ఇమెయిల్ సైతం పంపించారు.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?