Actress Thaapsee Talks About Marriage: ఇటీవలే వివాహబంధంలోకి ఎంట్రీ ఇచ్చింది నటి తాప్సీ. ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడంపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది పూర్తిగా నా పర్సనల్ మ్యాటర్ అన్నారు. నా వివాహానికి సంబంధించిన విషయాలను వెల్లడించి అందరిలో ఆసక్తి పెంచాలని తాను అనుకోవడం లేదని అన్నారు ఆమె. దాని గురించి అందరూ చర్చించుకోవడం నాకు ఇష్టం లేదు.
అందుకే బయటకు చెప్పలేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఈ మ్యాటర్‌లో నా పార్ట్‌నర్‌కి వేరే ఒపీనియన్ ఉండొచ్చు. అందుకే మేము దీని గురించి మీడియా వాళ్లకు, సోషల్‌మీడియా వాళ్లకు చెప్పలేదు. నా సన్నిహితులు, బంధువులు స్టార్టింగ్ నుండే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్లకు అన్ని తెలుసు. వాళ్ల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాం. హంగు ఆర్భాటాలకు చోటివ్వకుండా కొందరి సమక్షంలో ఒక్కటయ్యాం.
Also Read:మూవీకి నో రెమ్యూనరేషన్ అంటున్న స్టార్ హీరో
ఇక నా పెళ్లి ఫోటోలు, వీడియోలను కూడా పంచుకోవడానికి ప్రస్తుతం రెడీగా లేను. భవిష్యత్‌లో అందరికి షేర్ చేయాలనుకుంటే అప్పుడు మా పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తానని చెప్పారు. మార్చి 23న ఉదయ్‌పూర్‌లో తాప్సీ మాథియాస్‌బో వివాహం జరిగింది. ఇటీవల వీరి పెళ్లి వీడియో లీకవ్వగా అది వైరల్‌గా మారింది.
ఇక ఈ భామ చేస్తున్న మూవీస్ మ్యాటర్‌కొస్తే… గతేడాది డంకీతో హిట్ ట్రాక్‌లో సొంతం చేసుకున్నారు తాప్సీ. ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా కోసం వర్క్ చేస్తున్నాడు. హసీన్ దిల్‌రుబాకు సీక్వెల్‌గా ఇది రానుంది. ఈ మూవీలో విక్రాంత్ మాస్సే మెయిన్ రోల్లో కనిపించనున్నారు. దీనితో పాటు ఆమె నటించిన మరో రెండు మూవీస్ రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. అలాగే ఇటీవల రిలీజైన ధక్ ధక్ మూవీకి తాప్సీ నిర్మాతగానూ వ్యవహరించారు.