Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. కేజీఎఫ్ మూవీతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు యష్. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ 2 మూవీ తర్వాత టాక్సిక్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఆయన నటిస్తున్న కొత్త మూవీ రామాయణం గురించి రోజుకొక కొత్త వార్త తెరపైకి వస్తోంది. రామాయణం మూవీలో యష్ రావణాసురుడిగా నటిస్తున్నారని టాక్. ఇంతవరకు దీనిపై క్లారిటీ రాలేదు. అంతేకాదు రామాయణం మూవీ కోసం యష్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకు పారితోషికం అసలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడట యష్.
Also Read:స్టార్ హీరోయిన్ భర్త ఓ బిలియనీర్ అని మీకు తెలుసా.?
చాలా ఏళ్లుగా యష్ ఒక్కో మూవీకి రెమ్యునరేషన్ భారీగా తీసుకున్నాడు. ఇప్పుడు యష్ స్టార్ డమ్ భారీగా పెరిగిపోయింది. అందుకే రామాయణం మూవీతో యష్ రెమ్యునరేషన్ అందుకోవడం లేదట. రామాయణం మూవీకి రెమ్యునరేషన్‌గా 80 కోట్లు డిమాండ్ చేశాడట. అయితే ఇప్పుడు ఆ 80 కోట్ల రూపాయలను మూవీలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాడట. గతంలో రణబీర్ కపూర్ కూడా బ్రహ్మాస్త్ర మూవీకి ఇలానే చేశాడు. రణబీర్ కపూర్ రామాయణం మూవీకి ఇప్పటికే తన రెమ్యునరేషన్ 75 కోట్లుగా ఫిక్స్ చేసుకున్నాడట.
ఇంతకుముందు రణబీర్ ఒక్కో సినిమాకు 30-35 కోట్లు తీసుకున్నాడు. అయితే రామాయణం మూవీకి అదనపు రెమ్యూనరేషన్ అందుకున్నాడు. సాయిపల్లవికి 6 కోట్లు ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. కాగా.. రామాయణం మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ముంబయిలోని ఓ స్టూడియోలో భారీ సెట్ వేసి రికార్డు చేస్తున్నారు. తాజాగా ఈ సెట్‌కు సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.