Rebel Star Prabhas Create New Record From Kalki 2898 Ad Movie
Cinema

Tollywood Movie: రూ. 100 కోట్ల క్లబ్‌లోకి..

Rebel Star Prabhas Create New Record From Kalki 2898 Ad Movie: ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద కల్కి 2898 ఏడీ మానియా నడుస్తోంది.థియేటర్‌లో రికార్డుల సునామీని కురిపిస్తోంది. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ తొలిరోజు రూ.191.5కోట్లు వసూలు చేసింది.

గత కొన్నేళ్లుగా పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో కొన్ని మూవీస్ రిలీజైన ఫస్ట్‌డే రూ.100 కోట్ల కలెక్షన్లను సునాయాసంగా రాబట్టాయి.ఇప్పుడు ఆ మూవీల జాబితాలో కల్కి వచ్చి చేరింది. రూ.100 కోట్ల రికార్డును సాధించిన 11వ మూవీగా కల్కి నిలిచింది. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇందులో డార్లింగ్‌ ప్రభాస్‌ నటించినవే ఐదు సినిమాలు ఉండటం గమనార్హం. తొలిరోజు రూ.100 కోట్లు పైన వసూలు చేసిన చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఉంది. ఫస్ట్‌డే ఈ మూవీ రూ.223 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బాహుబలి ఉంది. ఇది రూ.217 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా. ఇప్పుడు మూడో స్థానంలో కల్కి 2898 ఏడీ ఉంది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.191.5 కోట్లు వసూలు చేసింది.

Also Read: ఆ మూవీలో హీరోయిన్‌గా..?

వీటి తర్వాత స్థానాల్లో కేజీయఫ్‌2, సలార్‌ పార్ట్‌1, లియో, సాహో, జవాన్‌, ఆది పురుష్‌, యానిమల్‌, పఠాన్‌ చిత్రాలు ఉన్నాయి. మరోవైపు కల్కి చూసిన ఫ్యాన్స్‌ అందరూ పార్ట్‌-2 ఎప్పుడంటూ సోషల్‌మీడియా వేదికగా చర్చ పెట్టారు. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న మూవీ యూనిట్ కొన్ని డేస్‌ రెస్ట్ తీసుకుని నెక్స్ట్ పార్ట్‌కి సంబంధించిన వర్క్స్‌ని స్టార్ట్ చేసే ఛాన్సుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?