Balakrishna latest movie updates: డైరెక్టర్ బాబీ కాంబోలో నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన ఎన్బీకే 109 మూవీ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీ నుంచి బాలయ్య ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ రిలీజై ఆడియెన్స్‌లో భారీ హైప్‌ని పెంచేశాయి. అయితే ఇందులో ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ కీ రోల్‌లో యాక్ట్ చేస్తున్నట్లు టాక్. కానీ హీరోయిన్‌గా నటించేది ఎవరో రివీల్ చేయలేదు.
అలాగే విలన్, తదితర రోల్స్‌లో యాక్ట్ చేసే నటీనటుల డీటెయిల్స్ సీక్రెట్‌గా ఉంచుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఎన్బీకే 109లో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ సెలెక్ట్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి ఓ రీజన్ ఉంది. ప్రగ్యా జైస్వాల్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన ఫొటో బాలయ్య షూటింగ్ సెట్ నుంచి చేసిందని నెటిజన్లు పట్టేశారు.
Also Read:పాపం..భామకి కొత్త చిక్కులు
దీంతో హీరోయిన్ ఆమె అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రిలీజ్ కాలేదు. త్వరలోనే మేకర్స్ ఈ అమ్మడు పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మాత్రం అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ తప్పనిసరిగా రావాల్సి ఉంది.