Icon Star Allu Arjun Director Atlee Latest Movie Update
Cinema

Icon Star : ఇద్దరమ్మాయిలతో రచ్చ చేయనున్న బన్నీ

Icon Star Allu Arjun Director Atlee Latest Movie Update: డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ యాక్ట్ చేసిన ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మూవీ పుష్ప. ఈ మూవీ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా అదే సీక్వెల్‌లో పుష్ప 2 మూవీ రాబోతోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ పనుల్లో నిమగ్నమై బిజీబిజీగా ఉన్నారు హీరో అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్.

ఇక ఈ మూవీ మాట అటుంచితే ఈ మూవీ తరువాత బన్నీ నెక్స్ట్ మూవీ ప్లాన్స్‌ ఏంటన్న మ్యాటర్‌పై ఇప్పుడిప్పుడే క్లారిటీ వ‌స్తోంది. ‘పుష్ప 2’మూవీ కంప్లీట్ అవ్వ‌గానే బ్యాక్‌ టూ బ్యాక్‌ మూవీస్ చేయబోతున్నాడు. అట్లీతో మూవీని ప‌ట్టాలెక్కించే ఛాన్సులు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఈనెల 8న బ‌న్నీ బ‌ర్త్ డే.

Read Also: ఇచ్చి పడేశిన డిజే టిల్లు సీక్వెల్‌

ఈ సంద‌ర్భంగా అట్లీ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ త్వరలో రానుంది. ఇప్ప‌టికే బ‌న్నీ కోసం ఓ ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీని రెడీ చేసే ప‌నిలో పడ్డాడు అట్లీ. క‌థానాయిక‌ల కోసం వేట కూడా మొద‌లెట్టేశాడ‌ట‌. ఈ మూవీలో హీరోయిన్‌గా ఇదివ‌రకు త్రిష పేరు వినిపించింది. తాజాగా స‌మంత పేరు ఖాయ‌మైందంటూ వార్త‌లు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీలో ఒక‌రు కాదు..ఇద్ద‌రు హీరోయిన్లు క‌నిపించే ఛాన్స్‌ ఉంద‌ట‌.

ఆ ఇద్ద‌రి హీరోయిన్లు త్రిష‌, స‌మంత‌లనే టాక్ వినిపిస్తోంది. బ‌న్నీ ప‌క్క‌న స‌మంత ఇది వ‌ర‌కే సన్‌ ఆఫ్ సత్యమూర్తి మూవీలో న‌టించింది. కానీ త్రిషతో ఇదే ఫస్ట్ మూవీ కావడం ఈ సినిమాకి హైలెట్ కానుంది. అంతేకాకుండా బ‌న్నీ త్రిష కాంబో కాస్త కొత్త‌గా అనిపించే మ్యాటర్. అందుకే అట్లీ.. త్రిష వైపు మొగ్గు చూపిస్తున్నాడ‌ట‌. అనిరుథ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. స‌న్ పిక్చ‌ర్స్ ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతోంది. త్రివిక్ర‌మ్‌, బోయ‌పాటి శ్రీ‌నుల‌తో చెరో మూవీ చేయాలి బ‌న్నీ. వాటికి సంబంధించిన అప్ డేట్స్ కూడా బ‌న్నీ బ‌ర్త్ డేకి రావొచ్చనే టాక్ చిత్రవర్గాల్లో వినిపిస్తున్నాయి.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?