Tollywood News | దావత్‌కి రెడీనా అంటున్న మాస్ మహారాజా..!
Hero Raviteja 75th Film Announcement In Ugadi Occasion Target Sankranthi
Cinema

Tollywood News: 75వ సినిమాతో దావత్‌కి రెడీ అంటున్న మాస్ మహారాజా..!

Hero Raviteja 75th Film Announcement In Ugadi Occasion Target Sankranthi: టాలీవుడ్ హీరో మాస్‌ మహారాజా రవితేజ జయాపజయాలకు అతీతంగా జెట్‌ స్పీడ్‌తో బ్రేకుల్లేకుండా మూవీస్‌ని కంటిన్యూ చేస్తున్నాడు. కానీ తనకు సరైన హిట్ పడటం లేదు. ఎన్నో హోప్స్‌ పెట్టుకున్న ఈగల్‌ మూవీ డిజాస్టర్ అయింది. ఇక ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్న మాస్‌ మహారాజా తాజాగా కొత్త మూవీని ఉగాదిని పురస్కరించుకుని అనౌన్స్‌ చేశారు.

కొత్త దర్శకుడు భాను భోగవరపు డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కుతుండటం హైలెట్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ మూవీస్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ మూవీని ప్రకటిస్తూ సినిమా కాన్సెప్ట్, రవితేజ పాత్రలను రివీల్ చేశారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇది రవితేజ నటిస్తున్న 75వ మూవీ. ఈ పోస్టర్‌లో రవితేజ 75వ చిత్రం అని తెలుపుతూ కళ్ళద్దాల మీద ఆర్‌టీ 75 అని రాయడం బాగుంది.

Also Read:ఏది హిట్టో, ఏది ఫ్లాపో నాకు తెలుసన్న నటి..!

అలాగే పోస్టర్ మీద రవన్న దావత్ ఇస్తుండు. రెడీ అయిపోండ్రి. హ్యాపీ ఉగాది రా భయ్ అని తెలంగాణ యాసలో రాయడం ఇంట్రెస్టింగ్‌ని కలిగిస్తోంది. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే మూవీ అని టైటిల్‌ని బట్టి అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో రవితేజ రోల్ పేరు లక్ష్మణ భేరి అని, అంతేకాకుండా తన రోల్‌ ఎలా ఉంటుందో ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. ఆదాయం చెప్పను తియ్ ఖర్చు లెక్క జెయ్యన్. రాజ్యపూజ్యం అన్ లిమిటెడ్. అవమానం జీరో అంటూ రవితేజ పోషిస్తున్న రోల్‌ గురించి పోస్టర్‌పై రాసుకొచ్చిన తీరు చాలా వెరైటీగా ఉంది.

అంతేకాదు ఈ మూవీ కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉండబోతుందనే సందేశాన్నిస్తుంది. ఈ పోస్టర్ మూవీపై ఆడియెన్స్‌లో ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రానికి ప్రతిభావంతులైన స్వరకర్త భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్‌ని అందిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ మూవీ ధూమ్ ధామ్ మాస్ దావత్ అంటూ రాసుకొచ్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికల్లా ఈ మూవీ రిలీజ్‌ కాబోతుందని మేకర్స్ తెలిపారు.

Just In

01

Xiaomi: ప్రీమియం ఫీచర్లతో త్వరలో లాంచ్ కానున్న రెడ్‌మి నోట్ 15 సిరీస్

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం