Actress Nayantara Interesting Comments About Jawaan Movie: బాలీవుడ్‌లో షారుక్‌ఖాన్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ జవాన్. ఈ మూవీ ఎంత పెద్ద హిట్‌ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జవాన్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. విడుదలై ఏడాది దాటినా సరే ఇంకా దానిపై టాక్ ఆగడం లేదు. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతో తొలిసారి నయనతార బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీలో దీపికా పదుకొణె కూడా యాక్ట్ చేసింది. నయన్ క్యారెక్టర్ కంటే దీపికా క్యారెక్టర్ హైలైట్ అవుతుందని రిలీజ్‌కు ముందు వినిపించాయి. దీనిపై నయనతార డిసప్పాయింట్‌కి గురైందని వార్తలు వచ్చాయి. కానీ..ఇదంతా రూమర్ మాత్రమే అని తేలిపోయింది. తాజాగా నయనతార జవాన్ గురించి అలాగే తన రోల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘జవాన్’ మూవీ తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషల్లో రిలీజ్ అయ్యి, అన్ని భాషల్లో సూపర్ హిట్ మూవీగా నిలిచింది ఈ మూవీ. అట్లీ డైరెక్షన్ ఆడియెన్స్‌ని ఎంతగానో మెప్పించింది. ఈ మూవీలో షారుక్‌ఖాన్ చాలా షేడ్స్‌లో కనిపించి ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాడు. షారుక్ ఖాన్, నయనతారతో పాటు దీపికా పదుకొణె, సన్యా మల్హోత్రా, ప్రియమణి, సునీల్ గ్రోవర్ తదితరులు ఈ మూవీలో యాక్ట్ చేశారు. కాగా నయనతార రోల్‌కు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ గురించి నయనతార మాట్లాడుతూ.. నేను జవాన్ లాంటి కోసం ఎదురుచూశాను. భారీ కాస్ట్ ఉండాలి. నా రోల్‌కు వెయిట్ కూడా ఉండాలని అనుకున్నానని నయన తెలిపింది. ఆ రకంగానే ఈ మూవీలో నాకు ఛాన్స్ వచ్చింది. జవాన్ మూవీ చేయడానికి షారుక్ ఖానే మెయిన్ రీజన్ అని నయనతార తెలిపింది. షారుఖ్‌తో నటించాలని చాలామంది కోరుకుంటారు. అందులో నేను ఒకదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.
Also Read:మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న కాజల్..!
ఇక షారుఖ్ ఖాన్‌కు ఎవరు ఫ్యాన్స్ ఉండరు చెప్పండి. ఆయనను చూస్తూ పెరిగాను. షారుక్ మహిళలను చాలా గౌరవిస్తాడు. జవాన్ పెద్ద హిట్ సాదిస్తుందని నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాలుగా జవాన్‌లో పనిచేసిన నాకు ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది ఫ్లాప్ అవుతుందో నాకు తెలుసని తెలిపింది నయన్. ప్రస్తుతం నయనతార చాలా సినిమాల్లో నటిస్తోంది. జవాన్ విజయం సాధించిన తర్వాత నయన్ స్టార్ హీరోలతో పాటు, చిన్న హీరోల సినిమాలు, యంగ్ డైరెక్టర్ల మూవీస్ కూడా ఓకే చేస్తుంది. తాజాగా..మన్నంగట్టి సిన్స్ 1960 లో నటిస్తుంది నయన్. ఈ మూవీకి డ్యూడ్ విక్కీ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మూవీలో సిద్ధార్థ్, త్రిష, ఆర్ మాధవన్ యాక్ట్ చేస్తున్నారు. నిర్మాత శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న తొలి మూవీలో కూడా నయనతార నటిస్తోంది.