Kalki 2898 AD | డార్లింగ్ కల్కి ట్రైలర్ అప్పుడే
Hero Prabhas Kalki 2898 Trailer Telugu Release Date
Cinema

Kalki 2898 AD: డార్లింగ్ కల్కి ట్రైలర్ అప్పుడే

Hero Prabhas Kalki 2898 Trailer Telugu Release Date: పాన్‌ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కల్కి. సమ్మర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. టెక్నికల్ ఇష్యూస్‌ కారణంగా వాయిదా పడింది. జూన్ 27న వస్తామని ఇదివరకే ప్రకటించిన మూవీ యూనిట్‌. రీసెంట్‌గానే బుజ్జి పేరుతో ఓ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఎన్నికల హడావుడి కారణంగా ప్రమోషన్స్‌కి చిన్న బ్రేక్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ స్టార్ట్‌ చేశారు.

ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఫ్యాన్స్‌కి మూవీ లవర్స్‌కి క్లారిటీ ఇచ్చేశారు. సలార్‌ మూవీతో గతేడాది వచ్చిన ప్రభాస్ హిట్ కొట్టాడు. ఇప్పుడు కల్కిగా రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై జనాల అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. ఈ మూవీలో ప్రభాస్ ఉపయోగించే కారు పేరు బుజ్జి. దీన్ని లాంచ్ చేస్తూ కొన్నిరోజుల ముందు హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా ఈవెంట్‌ని ఆర్గనైజ్‌ చేశారు. బుజ్జి టీజర్ రిలీజ్ చేయగా అది కాస్త అంచనాలని అమాంతం పెంచింది.

Also Read: మావయ్య, బాబాయ్‌కి నా శుభాకాంక్షలు

అయితే కల్కి ట్రైలర్ కోసమే ఫ్యాన్స్‌ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమే జూన్ 10న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్‌ అనౌన్స్‌ చేశారు. అయితే దీన్ని కూడా ముంబయిలో ఈవెంట్ పెట్టి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. దాదాపు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో ప్రభాస్‪‌తో పాటు బిగ్‌బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్‌హాసన్, బాలీవుడ్ హీరోయిన్‌లు దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?