Hero NagaChaitanya Fans Counter To Family Star Movie Director Parasuram
Cinema

Tollywood News : ఫ్యామిలీ స్టార్ మూవీపై నాగచైతన్య ఫ్యాన్స్‌ ఖుషీ, రీజన్ అదేనట..!

Hero NagaChaitanya Fans Counter To Family Star Movie Director Parasuram: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చాడు. గీతగోవిందం తరువాత దర్శకుడు పరుశురామ్‌తో మరోసారి కలిసి విజయ్ దేవరకొండ చేసిన మూవీ కావడంతో ఫ్యామిలీ స్టార్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ రెట్టింపు అయ్యాయి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. శుక్రవారం ఆడియెన్స్‌ ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. స్టోరీలో కొత్తదనం లేదని ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. ఫ్యామిలీ స్టార్‌పై హోప్స్‌ పెట్టుకున్న విజయ్ దేవరకొండకు మరోసారి నిరాశ ఎదురైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీకి నెగిటివ్ రివ్యూస్ రావడంతో హీరో నాగ చైతన్య ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫ్యామిలీ స్టార్ స్టోరీని ఫస్ట్‌ నాగ చైతన్యకు వినిపించాడట దర్శకుడు పరుశురామ్‌. మహేష్ బాబుతో సర్కారు వారి పాట మూవీ తరువాత నాగ చైతన్యతో పరుశురామ్‌ ఓ మూవీ ప్లాన్ చేశాడు. స్టోరీ కూడా లాక్ చేసి సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకున్న టైంలో సడన్‌గా నాగ చైతన్యతో మూవీని పరుశురామ్‌ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ వెంటనే విజయ్ దేవరకొండతో తన కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. పరుశురామ్‌‌తో మూవీ గురించి నాగ చైతన్యను ప్రశ్నించగా, అతను గురించి నన్ను అడక్కండి అంటూ అసహనం వ్యక్తం చేశారు.

Also Read: ఫ్యామిలీ స్టార్‌ ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే..!

పరుశురామ్‌ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అతను నా టైంను వేస్ట్ చేశారని చైతు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చైతన్యతో చేయాల్సిన మూవీని విజయ్ దేవరకొండతో చేయడం ఆ మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో నాగ చైతన్య ఫ్యాన్స్‌ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఖర్మ ఎవరిని వదిలిపెట్టదంటూ దర్శకుడు పరుశురామ్‌‌కు నాగ చైతన్య ఫ్యాన్స్‌ కౌంటరిస్తున్నారు.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?