Tollywood News Family Star Movie First Review: టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ,హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ (బుజ్జి) కాంబినేషన్‌లో రూపొందిన మూవీ ఇది. గోపీ సుందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ మూవీ గ్లింప్స్, పాటలు, టీజర్, ట్రైలర్.. మూవీపై మరిన్ని అంచనాలు పెంచాయని చెప్పాలి. ఏప్రిల్ 5 న ఈ మూవీ ఉగాది కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీని రిలీజ్‌కి ముందు చూసిన కొందరు ఇండస్ట్రీ పెద్దలు తమ ఒపీనియన్‌ని వ్యక్తపరచడం జరిగింది. వారి టాక్ ప్రకారం ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా కామెడీతో సాగుతుందట. విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్, అతని యాక్టింగ్ ఆకట్టుకునే విధంగా ఉంటాయట.
Also Read: బయోపిక్ నేను బతికుండగా రానివ్వను
యాక్షన్ సీక్వెన్స్‌లతో అతను మాస్ ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యే ఛాన్సులు ఉన్నాయంటున్నారు. ఆ తర్వాత హీరోయిన్ మృణాల్ హీరోని ఏవండీ అని పదే పదే పిలవడం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్ గా సాగుతుందట. క్లైమాక్స్ కూడా ఓకే అనిపిస్తుందంటున్నారు. స్టోరీలో కొంచెం చిరంజీవి గ్యాంగ్ లీడర్ పోలికలు ఉన్నప్పటికీ పరశురామ్ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని చాలా మట్టుకు ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెబుతున్నారు సినీ పెద్దలు.