Bollywood Hero Boney Kapoor Talks About Sridevi Biopic: అందాల తార స్వర్గీయ శ్రీదేవి బయోపిక్ విషయమై శ్రీదేవి భర్త బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉన్నంత వరకు శ్రీదేవి బయోపిక్ తీయలేరని అన్నారు. తాను నిర్మాతగా అజయ్ దేవ్‌గణ్ హీరోగా వస్తున్న మైదాన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా బోనీకపూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడీ కామెంట్స్ సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక అమిత్ రవీందర్‌నాథ్ శర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన మైదాన్ మూవీ ఈనెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా బోనీకపూర్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన భార్య శ్రీదేవి బయోపిక్ గురించి మాట్లాడుతూ నా భార్య పర్సనల్ లైఫ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది.
Also Read : బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ మానియా, ఆరవ రోజు కలెక్షన్స్ ఏకంగా..
పర్సనల్స్ మ్యాటర్స్ బయటికి తెలియాల్సిన అవసరం లేదని తన ఒపీనియన్. ఆమె ఆలోచలన్ని, వ్యక్తిత్వాన్ని నేను గౌరవిస్తాను. బయోపిక్ అంటే నిజాలను వక్రీకరించే ఛాన్స్ ఉంది. అందుకే నా భార్య ఆలోచనల ప్రకారం తన బయోపిక్ తీయడానికి నేను ఒప్పుకొను. నేను బతికి ఉన్నంత వరకు ఆమె బయోపిక్ రాదు. ఎవరూ తీయలేరని బోనీకపూర్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే చాలా రోజులుగా శ్రీదేవి బయోపిక్ చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్యలో బోనీకపూర్‌తో కాంటాక్ట్ అయినట్లు వార్తలొచ్చాయి.