Hero Kalyan Ram 21st Movie Update On Senior NTR Birth Anniversary
Cinema

Movie Updates: ఎన్‌కేఆర్‌ లేటెస్ట్‌ గ్లింప్స్ అదుర్స్

Hero Kalyan Ram 21st Movie Update On Senior NTR Birth Anniversary: నేడు సీనియర్ నటుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నందమూరి తారకరామారావు 101వ వర్థంతి. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా కళ్యాణ్‌రామ్ 21వ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార, డెవిల్ మూవీస్‌తో మంచి విజయాలను సాధించాడు. ఓ పక్క హీరోగా మూవీస్‌ చేస్తూ మరో పక్క నిర్మాతగా కూడా వరుస సినిమాలు చేస్తున్నారు.

గత ఏడాది దసరా టైమ్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ తన 21వ మూవీని కూడా అనౌన్స్ చేసారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా విజయశాంతి ఓ మెయిన్‌ రోల్‌ చేస్తున్నారు. నేడు కళ్యాణ్‌రామ్ తాతగారు సీనియర్ ఎన్టీఆర్ 101వ వర్థంతి సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ని ఇచ్చారు. ఈ మూవీ మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేసి షూట్ శరవేగంగా జరుగుతుందని అనౌన్స్ చేశారు.

Also Read:మాస్‌ లుక్‌లో పోస్టర్ రిలీజ్ 

కళ్యాణ్‌రామ్ ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్‌గా కనిపించబోతున్నాడని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌ కొడతామని పోస్ట్ చేసారు మూవీ యూనిట్. మరి ఈ మూవీతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తాడో లేదో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు