Bachchala Malli First Look Allari Naresh Turns Ferocious: టాలీవుడ్‌లో అల్లరి మూవీతో ఎంట్రీ ఇచ్చిన హీరో అల్లరి నరేష్. బ్యాక్ టు బ్యాక్ కామెడీ మూవీస్‌తో దూసుకెళ్తూ ఈ మధ్యే వైవిధ్యమైన మూవీస్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.ఇటీవల ఆ ఒక్కటి అడక్కు మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ మే 3న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ అనుకున్న స్థాయిలో హిట్‌ని అందుకోలేకపోయింది.
తాజాగా అల్లరి నరేష్ 62వ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ రిలీజ్ అయ్యింది. అల్లరి నరేష్, అమృత అయ్యర్ హీరోహీరోయిన్‌లుగా యాక్ట్ చేసిన ఈ మూవీకి బచ్చల మల్లి అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. అయితే దీనికి సుబ్బు వంగాదేవి డైరెక్షన్ వహిస్తుండగా హాస్యా మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ని జత చేశారు. పేరు మల్లి. ఇంటి పేరు బచ్చల. చేసేది ట్రాక్టర్ డ్రైవింగ్. ఈ బచ్చల మల్లి ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతాడని ఈ పోస్టర్‌లో రాసుకొచ్చారు.
Also Read: రీ రిలీజ్ మూవీస్‌కి కరువవుతున్న ఫ్యాన్స్
అలాగే షూటింగ్ తొందరలోనే స్టార్ట్ కానున్నట్లు వెల్లడించారు మూవీ యూనిట్. అయితే ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్ మాస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. జాతర జరుగుతుండగా రిక్షాపై కూర్చొని బీడీ తాగుతూ కోపంగా చూస్తున్నట్లు ఈ పోస్టర్‌లో కనిపిస్తాడు. ఇక ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్, ఆడియెన్స్ ఈ మూవీతో మరోసారి హిట్‌ని తన ఖాతాలో వేసుకోనున్నాడని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంటాడో ఈ మూవీ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయకతప్పదు.