Date Fixed For Kannappa Teaser
Cinema

Kannappa Movie: కన్నప్ప టీజర్‌కి డేట్‌ ఫిక్స్‌… 

Date Fixed For Kannappa Teaser: టాలీవుడ్‌ డైనమిక్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్నప్ప మూవీ త్వరలో తెరమీదకు రానుంది. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి కంప్లీట్‌ కావొస్తుంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ మీద కొన్ని సీన్లను చిత్రీకరించారు. ఆపై ప్రభాస్ మీద కొన్ని సీన్స్‌ని చిత్రీకరించారు. కేన్స్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీం సందడి చేసింది.

మోహన్‌బాబు, మంచు విష్ణు, ప్రభుదేవా వంటి వారు కన్నప్ప కోసం కేన్స్ ఫెస్టివల్‌కు వెళ్లారు. ఇక అక్కడే మూవీ టీజర్‌ను అందరికీ ఇంట్రడ్యూస్‌ చేశారు. కన్నప్ప టీజర్‌కు అక్కడి వారంతా ఫిదా అయిపోయారు. ఇక మూవీ టీజర్‌ను ఇండియన్ ఆడియెన్స్‌కు చూపించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 13న ఇండియా వైడ్‌గా కన్నప్ప టీజర్ రిలీజ్‌ కానుంది. కానీ అంతకు ముందే టాలీవుడ్‌ ఆడియెన్స్‌కు కన్నప్ప టీజర్‌ను చూపించబోతున్నారు. ఈనెల 30న టాలీవుడ్‌లో కన్నప్ప టీజర్‌ను ముందుగా రిలీజ్ చేస్తామని మంచు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు విష్ణు ఓ ట్వీట్ వేశారు. కేన్స్‌లో మా కన్నప్ప టీజర్‌ను అందరికీ చూపించాం. టీజర్‌ను చూసి అందరూ ప్రశంసించారు.

Also Read:భయపడ్డ కాజల్‌, కారణం ఎవరంటే..?

ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్లు, అక్కడికి వచ్చిన ఇండియన్స్ కన్నప్ప టీజర్‌ను చూసి ఫిదా అయ్యారు. ఆ రియాక్షన్ చూసిన తరువాత నాకు కలిగిన హ్యాపీ అంతా ఇంతా కాదు. మన ఇండియన్ ఆడియెన్స్‌కు జూన్ 13న టీజర్ చూపించబోతున్నాం. ఈనెల 30న టాలీవుడ్‌ టీజర్‌ను హైదరాబాద్‌లోని పాపులర్ థియేటర్‌లో ప్రదర్శించనున్నామని అన్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మోహన్‌బాబు నిర్మాణంలో ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!