Actress Kajal Is Scared, Who Is The Reason?: చందమామ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన నటి కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలతో మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఎదిగి 17 ఏళ్లుగా సినీ సీమలో ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది. కరోనా టైంలో కొన్నాళ్ళు మూవీస్‌కి గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకొని, ఓ బాబుకి జన్మనిచ్చి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.
ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో టాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు వస్తుంది. కాజల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ చేసిన సత్యభామ. ఈ మూవీ అతి త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ మూవీ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్‌ని రివీల్ చేసింది. మీ ఫ్యాన్స్ చేసిన క్రేజీయెస్ట్ పని ఏదైనా ఉందా..? అని అడగగా కాజల్ రిప్లై ఇస్తూ.. క్రేజీ కాదు కానీ ఓ ఇన్సిడెంట్ జరిగింది.
Also Read:కల్కి 2898 ఏడీ ఈవెంట్ ఎక్కడంటే..?
ఒక మూవీ షూటింగ్‌లో ఉన్నప్పుడు అదే మొదటి రోజు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ నా కారవాన్‌లోకి వచ్చి షర్ట్ తీసేసాడు. నేను ఒక్కసారిగా కంగుతిని భయపడిపోయాను. నాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పి అతని చాతి మీద నా పేరు టాటూ వేయించుకున్నది చూపించాడు. వెంటనే ఇలా బిహేవ్ చేయకూడదు, అలా ఎలా చేస్తావు, ఇది కరెక్ట్ కాదని గట్టిగానే చెప్పాను. అది ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్. ఎవరూ అలా చేయకండి అని చెప్పింది. మరి ఇంతకీ కాజల్‌ని భయపెట్టిన ఆ డైరెక్టర్ ఎవరనే పనిలో పడ్డారు నెటిజన్స్. అంతేకాదు అలా ఎలా చేస్తారని కొందరు, తప్పేముందని మరికొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.