Actress Parineeti Chopra Stuns In A Gorgeous Double Coloured Saree: బాలీవుడ్ నటి పరిణితి చోప్రా తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. ఆమె నటనకు గాను ఫిల్మ్‌ఫేర్, నేషనల్ ఫిల్మ్ ఫేర్ వంటి అవార్డు అందుకుంది. 2013లో ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకుంది. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు రాఘవ్ చద్దాని పెళ్లి చేసుకుని వివాహం బంధంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ కెరీర్ పరంగా దూసుకుపోతుంది పరిణితి.
తన మూవీ చమ్కిలా మూవీ ప్రమోషన్‌లో భాగంగా పరిణితి చక్కటి చీరలో గ్లామరస్ లుక్‌లో సందడి చేసింది. ఎంబ్రాయిడరీతో కూడిన బ్లాక్ అండ్ వైట్ చీరలో అందమంతా ఆమెలోనే దాగుందా అన్నంత ఆకర్షణగా ఆమె కనిపించింది. ఆ ఎంబ్రాయిడరీ చీరకు తగ్గట్టు హై నెక్‌బ్లౌజ్ జత చేయడం మరింత అందాన్నితెచ్చి పెట్టింది. పూలా ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన బ్లాక్ అండ్ వైట్ ఆరు గజాల చీర ఆమె అందాన్ని రెట్టింపు చేసేలా మరింత అందంగా ఉంది పరిణితి.
Also Read: పెళ్లి రూమర్స్‌పై హీరో సిద్ధార్థ్ రియాక్షన్
చాలా సింపుల్‌గా జస్ట్ చెవులకు మాత్రమే డైమెండ్‌లతో కూడిన చెవిపోగులు పెట్టుకుంది. లైట్ మేకప్‌తో కళ్లను హైలెట్ చేసేలా స్మోకీ ఐషాడో వేసుకుంది. హెయిర్‌ని ప్రీగా వదిలేసింది. ఇక ఇక్కడ పరిణితీ ధరించి చీర ప్రముఖ శ్రియా ఖన్నా బ్రాండ్‌కి చెందింది. ఈ బ్రాండ్ చీరలన్ని సంప్రదాయం ఉట్టిపడేలా చక్కటి ఎంబ్రాయిడర్‌తో హుందాగా ఉంటాయి. వాటి ధర రూ. 30 వేలు దాక పలుతుంది. ప్రస్తుతం ఈమె చీరకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.