Hero Siddharth Comments About His Wedding Date Aditi Rao Hydari: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు నువ్వోస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్ వంటి లవ్‌స్టోరీ మూవీలతో లవర్ బాయ్‌గా మారి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అనుహ్యంగా టాలీవుడ్‌కి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చాలాకాలం గ్యాప్ తర్వాత మహాసముద్రంతో రీ-ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ ఇప్పుడు సహాయ నటుడిగానూ రాణిస్తున్నాడు. అయితే కొన్నాళ్లుగా సిద్ధార్థ్ పేరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. చాలా రోజులుగా హీరోయిన్ అదితితో ప్రేమలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే తమ ప్రేమ గురించి వస్తున్న రూమర్స్‌పై వీరిద్దరు స్పందించలేదు.
ఇటీవలే వీరిద్దరి పెళ్లి రహస్యంగా జరిగిందని న్యూస్ స్ప్రెడ్ అయింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలోని శ్రీరంగనాయక ఆలయంలో ఇరు ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లు రూమర్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫోటోస్ లీకవడంతో జాగ్రత్తలు తీసుకున్నారు. పెళ్లి గురించి నెట్టింట హల్చల్ చేస్తున్న టైంలో వీరిద్దరు తమకు నిశ్చితార్థం జరిగిందంటూ రివీల్ చేశారు. తాజాగా ఈ విషయంపై సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఓ అవార్డ్ వేడుకలో పాల్గొన్న సిద్ధార్థ్ మాట్లాడుతూ మేము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది మాట్లాడుకుంటున్నారు. సీక్రెట్, ప్రైవేట్ ఈ రెండు పదాలకు చాలా వ్యత్యాసం ఉంది.
Also Read:రణబీర్ కపూర్ లేటెస్ట్ లుక్స్‌కి నెటిజన్స్ ఫిదా
మా నిశ్చితార్థానికి ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే దీనిని సీక్రెట్ వేడుక అని భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే మాది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్. కానీ ఇది షూటింగ్ కాదు నేను నిర్ణయించడానికి. ఇది లైఫ్ టైమ్ డేట్. కేవలం పెద్దల నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. వాళ్లు ఎప్పుడు ఎక్కడ జరగాలనుకుంటే అక్కడే జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. అలాగే మీ ప్రపోజల్‌ను అంగీకరించడానికి అదితి ఎన్ని రోజుల సమయం తీసుకున్నారని అడగ్గా.. సిద్ధార్థ్ మాట్లాడుతూ ఈ ప్రశ్నలు నన్ను అడగొద్దు. ఎందుకంటే నాకు ఎస్ లేదా నో అనే రిజల్ట్ మాత్రమే మెయిన్. నేను ప్రపోజ్ చేయగానే ఆమె ఎస్ చెబుతుందా ?లేదా ? అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆమె అంగీకరించిందని సున్నితంగా సమాధానం చెప్పాడు.