Netizens React To Ranbir Kapoor To Play Lord Ram In Ramayana: ప్రముఖ డైరెక్టర్ నితేష్ తివారీ డైరెక్షన్‌లో రాబోతున్న మూవీ రామాయణం. ఈ మూవీలో రాముడి పాత్రలో యాక్ట్ చేయడానికి రణబీర్ కపూర్ రెడీ అవుతున్నాడు. సెట్స్ నుండి లారా దత్తా, అరుణ్ గోవిల్ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇదిలా ఉండగా శనివారం రాత్రి నగరంలో జరిగిన నిర్మాత నమిత్ మల్హోత్రా బర్త్‌డే సెలబ్రేషన్‌కు రణబీర్, అలియాభట్, నితేష్ తివారీ హాజరయ్యారు. ఇక యానిమల్ హీరో రూ. 8 కోట్ల విలువైన తన సరికొత్త బెంట్లీ కాంటినెంటల్‌ను నడుపుతూ కనిపించాడు.
కానీ రణబీర్ యొక్క బాడీ షేప్‌ని మాత్రం అస్సలు మిస్సవ్వలేదు. యానిమల్ రిలీజ్ తర్వాత, రణబీర్ కొంత బరువు పెరిగాడని అనుకున్నారు. కానీ అతని ఫ్యాన్స్ ఇప్పుడు అతను క్లీన్ షేవ్ లుక్‌లో తన లీన్ అవతార్‌కి తిరిగి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అతని బాడీ షేప్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్స్ ఎలా స్పందించారంటే..డబుల్ గడ్డం, ముఖం కొవ్వు పోయింది. ఖచ్చితమైన దవడ వచ్చిందని ఒకరు. మరొకరు ఇలా రాసుకొచ్చాడు.
Also Read: టిల్లు స్క్వేర్‌పై ప్రశంసల వెల్లువ, తాజాగా రామ్‌చరణ్ ఏమన్నాడంటే..!
అతను ఇప్పుడు రాముడి గెటప్ కోసం అత్యంత పరిపూర్ణమైన ఆకృతిలో ఉన్నాడని పరిపూర్ణ రామాయణం లోడ్ అవుతోందని.. ఏప్రిల్ 17 వరకు నేను వెయిట్ చేయలేనని అన్నాడు. మరొక నెటిజన్ ఈ ట్వీట్‌ను మళ్లీ షేర్ చేస్తూ రణబీర్ పర్ఫెక్షనిస్ట్. అతను పోషించే ప్రతి రోల్‌కి తన ఆకృతిని ఎలా మార్చుకోవాలో అతనికి తెలుసని అన్నాడు. ఇక ఈ మూవీలో రణబీర్ రాముడిగా, నటి సాయిపల్లవి సీతగా, లారాదత్తా కైకేయి, షీబా చద్దా మంథరగా కనిపిస్తారని తెలిపారు.
అరుణ్ గోవిల్ కింగ్ దశరథ్ రోల్లో కనిపించనున్నారు. ఇక మూవీ యూనిట్ తెలిపిన సమాచారం ప్రకారం రాకింగ్ స్టార్ యష్ రావణ్ పాత్రలో నటిస్తుండగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ఈ మూవీ 2025 దీపావళికి రిలీజ్ కానుండగా..ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ఏప్రిల్ 17 రామనవమి రోజున ప్రకటించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.