Actress Mehreen Open Warning To Some Journalists
Cinema

Tollywood Actress: జర్నలిస్ట్‌లపై అసహనం వ్యక్తం చేసిన నటి

Actress Mehreen Open Warning To Some Journalists: టాలీవుడ్ నటి బబ్లీ హీరోయిన్ మెహ్రీన్‌ ఫైర్‌ అయ్యింది. ఓ సెక్షన్ మీడియాపై అసహనం వ్యక్తం చేస్తూ విరుచుకుపడింది. ఇష్టమొచ్చినట్లుగా రాతలు రాస్తే చట్టపరమైన చర్యలు కారకులవుతారని వారిని హెచ్చరించింది.

ఇంతకీ అసలు మ్యాటర్‌ ఏంటంటే..రీసెంట్‌గా మెహ్రీన్ ఫ్రీజింగ్ ఎగ్స్ ప్రాసెసింగ్‌ ద్వారా అండాల్ని భద్రపరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అనౌన్స్ చేసింది. అయితే ఓ సెక్షన్ మీడియా దీన్ని మరో విధంగా రాసుకొచ్చింది. దీంతో మెహ్రీన్ తనదైన శైలిలో విచారం వ్యక్తం చేస్తూ సీరియస్ అయింది.ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం ఓ అమ్మాయి గర్భవతి కానవసరం లేదు. బాధ్యతాయుతమైన సెలబ్రిటీగా నా లక్ష్యం ఏంటంటే.. పిల్లలను కోల్పోయిన జంటలకు అవగాహన కోసం ఆ పోస్ట్ పెట్టాను. ఇక కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకునే అమ్మాయిలు, పెళ్లి చేసుకున్న తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని, బాధ్యతాయుతమైన తల్లులుగా మారడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పుడు శిశువును ప్లాన్ చేయడంపై అవగాహన కల్పించడం కోసం నేను ఆ పోస్ట్ పెట్టాను.

Also Read:సినిమా కష్టాలు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ 10 రోజులు బంద్

అయితే తను పెట్టిన ఆ పోస్టుపై పనిగట్టుకొని కొంతమంది తప్పుడు రాతలు రాస్తున్నారని, గర్భం దాల్చినట్టు వచ్చిన అలాంటి నివేదికలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడనని మెహ్రీన్ హెచ్చరిక జారీ చేసింది. రిపోర్టర్లమని చెప్పుకునే కొంతమంది బాధ్యతారహిత వ్యక్తులు తమ విలువలను కోల్పోయి దిగజారి మరీ వార్తలు రాస్తున్నారని.. తనపై రాసిన తప్పుడు రాతల్ని వెంటనే డిలీట్ చేయాలని, అంతేకాకుండా బహిరంగంగా తనకు క్షమాపణలు చెప్పాలని మెహ్రీన్ వారిని డిమాండ్ చేసింది. ప్రస్తుతం మెహ్రీన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంతేకాదు ఈ వార్త చూసిన నెటిజన్లు ఆమెకు మద్దతు ఇస్తూ అలాంటి వారిపై ఆమె తీసుకున్న నిర్ణయం సరైనదేనని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!