Actress Deepika Fires On Trolling Netizens
Cinema

Actress Deepika: ట్రోల్స్‌ చేసే నెటిజన్స్‌పై నటి ఫైర్‌

Actress Deepika Fires On Trolling Netizens: బాలీవుడ్‌ నటి సొట్టబుగ్గల క్వీన్‌ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కాబోతోంది. ప్రెగ్నెంట్‌ అయినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో భర్తతో కలిసి ఓటేయడానికి పోలింగ్‌ బూత్‌కు వెళ్లింది. ఆ సమయంలో బేబీ బంప్‌తో కనిపించింది. దీంతో తను సరోగసి ఆప్షన్‌ను ఎంచుకుందన్న వార్తలకు చెక్‌ పడినట్లయింది.

అయినప్పటికీ కొందరు నెటిజన్స్‌ ఆమెను అనుమానిస్తూనే ఉన్నారు. తనది నిజమైన బేబీ బంప్‌ కాదని, అదంతా యాక్టింగ్‌ అని తనని అవమానిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఆలియా భట్‌ సహా పలువురు సెలబ్రిటీలు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా దీపికా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌ను అలర్ట్‌ చేసింది. త్వరలో నేను లైవ్‌లోకి రాబోతున్నాను.

Also Read:కల్కి కోసం బుజ్జి, దీని ఖరీదు ఎంతంటే….!

అప్పటివరకు వెయిట్‌ చేయండి. ఓకే, బై అని రాసుకొచ్చింది. తన ప్రెగ్నెన్సీ గురించే మాట్లాడబోతుందని అభిమానులు భావిస్తున్నారు. తనను ట్రోల్‌ చేసేవారికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. మరి దీపికా ఏ లైవ్‌లోకి వచ్చి ఏ విషయం గురించి మాట్లాడనుందోనని నెటిజన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. కాగా హీరో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణెలకు 2018 నవంబర్‌ 14న వివాహం అయింది. వివాహమైన ఆరేళ్లకు ఈ దంపతులు పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనున్నారు.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?