Bujjy For Kalki, How Much Does It Cost?: నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. అత్యంత భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ఈ మూవీలో బిగ్‌బి అమితాబ్, లోకనాయకుడు కమల్‌హాసన్, దిశా పటానీ కీ రోల్స్ చేస్తున్నారు. తాజాగా డార్లింగ్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్‌ని రామోజీ ఫిలీం సిటీలో ఘనంగా నిర్వహించారు. అందులో ప్రభాస్ బుజ్జి ఇంట్రడక్షన్ మామూలుగా జరగలేదు. ఓ లెవల్‌లో ఎంట్రీ ఇచ్చిన డార్లింగ్.. బుజ్జి టైం స్టార్ట్ అయిందని సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు. ఈ ఎంట్రీకి ఫ్యాన్స్ ఈలలు, గోలలతో రామోజీ ఫిల్మ్ సిటీ అంతా మార్మోగిపోయింది. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కల్కి 2898 ఏడీలో భైరవ మామూలుగా ఉండబోడని.. ఈసారి డార్లింగ్ ప్రపంచానికే కింగ్ అయిపోతాడని ఖుష్ అవుతున్నారు.
ఇక ఇదిలా అంటే బుజ్జి పేరుతో ఇంట్రడ్యూస్ అయిన కారు ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగి పోతుంది అంటున్నారు నెటిజన్లు. ఆనంద్ మహీంద్రా పంచుకున్న ఇందుకు సంబంధించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కారు రైట్ సైడ్ టైరు సగటు మనిషిని మించి డిజైన్ చేశారు. పొడవు 6075mm, వెడల్పు 3380mm,ఎత్తు 2186mm,రిమ్ సైజ్ 34.5 ఇంచెస్ ఉండేలా ప్లాన్ చేసారు. వెనుక కూడా ఓ పెద్ద టైరు అమర్చారు. కారు వెయిట్ ఆరు టన్నులు కాగా పవర్ 94Kw, బ్యాటరీ 47KWH. టైర్లను ప్రముఖ కంపెనీ CEAT తయారుచేయగా, టోటల్ కారును మహేంద్ర, JM మోటార్స్ సంయుక్తంగా డిజైన్ చేశాయి. కాగా మూవీలో తనకోసం ఈ స్పెషల్ కారు తయారు చేసుకుంటాడని తెలుస్తుండగా థియేటర్‌లో ప్రభాస్‌ను చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Also Read: పాటను వాడినందుకు కేసు పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్
ఇక ఈ కారును తమిళనాడులోని కోయంబత్తూరులో తయారుచేశారు. బుజ్జి కారు తయారికి దాదాపు రూ. 7 కోట్లు వెచ్చించినట్లు టాక్. ఇక ఈ కారును డార్లింగ్ ప్రభాస్ స్వయంగా డ్రైవింగ్ చేసి ఫ్యాన్స్‌కి ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా జూన్ 27న రిలీజ్ కానుంది.
Meet #Bujji – a 6 tonne monster of a machine built by Mahindra and Jayem Autmotive
For the first time in the world #Kalki2898AD movie crew built a car completely from scratch just for a movie 🔥🔥
Made Up with a Cost of 7Cr for Car which is INSANE
pic.twitter.com/l534NTCrOU— Australian Telugu Films (@AuTelugu_Films) May 23, 2024