The Music Director Filed A Case For Using The Song: ఇటీవలే మళయాలంలో రిలీజై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన మూవీ మంజుమ్మల్ బాయ్స్. నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకొని పెద్దగా హిట్ అవుతుందన్న నమ్మకం లేకుండా ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ సునామీని సృష్టించింది. మలయాళంలో రిలీజై తెలుగు, తమిళంలో డబ్బింగ్ అయిన ఈ మూవీ బాక్సీఫీస్‌ను షేక్ చేసింది.
టైట్ స్క్రీన్‌ప్లేతో సాగే సర్వైవల్ థ్రిల్లర్ కావడంతో పాటుగా గుణకేవ్స్ చూపించడం ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. తాజాగా థియేటర్స్‌లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీకి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అయితే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీకి బిగ్‌షాక్ తగిలింది. ఈ మూవీని నిర్మించిన చిత్రబృందానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా నోటీసులు పంపారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో తాను గతంలో కంపోజ్ చేసిన గుణ మూవీలోని కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే అనే సాంగ్‌ని వాడారని ఆరోపించారు.
Also Read:బేబమ్మ అందాలకు కుర్రకారు ఫిదా..!
అయితే తన ఫర్మిషన్ లేకుండా ఈ హిట్ సాంగ్‌ను మూవీలో వాడుకున్నారని మంజుమ్మల్ బాయ్స్ చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజా నోటీసులు పంపారు.అయితే ఈ గుణ మూవీలో కమల్‌హాసన్ హీరోగా నటించారు. మూవీలో ఈ పాటను ఉపయోగించుకోవాలంటే మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఫర్మిషన్ తీసుకోవాలని కోరారు. లేదంటే కాపీరైట్‌ను ఉల్లంఘించినట్లే అవుతుందని నోటీసుల్లో ఇళయరాజా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ తతంగం జరగడంతో మళయాలంలో హాట్ టాఫిక్‌గా మారింది.