Saturday, June 29, 2024

Exclusive

Hyderabad PS: అసదుద్దిన్‌ కౌంటర్‌కి పోలీసుల రీ-కౌంటర్‌

-పోలీసుల నిర్ఱయం వివాదస్పదం
-నో ఫ్రెండ్లీ పోలీసింగ్‌, ఓన్లీ లాఠీచార్జ్‌
-పోలీసులపై మండిపడ్డ అసదుద్ధిన్‌
-ఇది మెట్రో సిటీనా, పల్లెటూరా..?
-అసదుద్ధిన్‌కి పోలీసులు కౌంటర్‌
-పాత నిబంధనల ప్రకారమే ఈ అనౌన్స్‌మెంట్‌
-ట్విట్టర్‌ వేదికగా సౌత్‌ జోన్‌ డీసీపీ స్నేహా మెహ్రా వివరణ

Hyderabad Police Clarity On New Rules For Hotels Shops Closing Times:రాత్రి వేళల్లో హైదరాబాద్‌ మహానగరంలో జరుగుతున్న నేరాలను కంట్రోల్‌ చేయడం కోసం పోలీసులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. నో ఫ్రెండ్లీ పోలీసింగ్‌, ఓన్లీ లాఠీఛార్జ్ అంటూ పోలీసులు చేసిన అనౌన్స్‌మెంట్‌పై రచ్చ రాజుకుంది. పాతబస్తీలో పోలీసులు చేస్తోన్న ఈ అనౌన్స్‌మెంట్‌పై ఒక రేంజ్‌లో మండిపడ్డారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. హైదరాబాద్‌ ఖాకీల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

ఇదే అనౌన్స్‌మెంట్‌ను జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో చేయగలరా అంటూ పోలీసులను ప్రశ్నించారు ఓవైసీ. అందరికీ ఒకే రూల్‌ వర్తిస్తుందనే సంగతి పోలీసులు గుర్తుంచుకోవాలంటూ ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. అసలు ఇది మెట్రో సిటీనా.. లేక పల్లెటూరా అన్నట్టుగా ప్రశ్నల వర్షం కురిపించారు. మెట్రో నగరాల్లో రాత్రిపూట కూడా షాపులు తెరిచే ఉంటాయి. హైదరాబాద్‌లో మాత్రం ఎందుకు తెరిచి ఉంచకూడదో చెప్పాలంటూ ఎక్స్‌ వేదికగా నిలదీశారు. అయితే, అసదుద్దీన్‌ ఒవైసీపై పోస్ట్‌పై స్పందించారు హైదరాబాద్‌ నగర పోలీస్‌ విభాగం. పాతబస్తీలో రాత్రి 11 గంటలకే షాపులు మూసివేయిస్తున్నారన్న వార్తలను ఖండించింది. అసదుద్దీన్‌కు కౌంటర్‌ ఇస్తూనే ప్రస్తుతమున్న నిబంధనలనే అమలు చేస్తున్నామంటూ వివరణ ఇచ్చారు పోలీస్‌ ఉన్నతాధికారులు. కొత్త రూల్స్‌ ఏమీ తీసుకురాలేదని సౌత్‌జోన్‌ డీసీపీ స్నేహ మెహ్రా చెప్పారు.

Also Read: ‘మెట్రో’ఆదాయం పెరిగింది

ఎప్పుడు వ్యాపార సముదాయాలు ఓపెన్‌ చేయాలో, మూసివేయాలో పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టామని తెలిపారు. అనేక సార్లు యాజమాన్యాలను హెచ్చరించాం. పోలీసులకు సహకరించకోపోతే సహకరించే విధంగా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు డీసీపీ స్నేహ మెహ్రా.అయితే పోలీస్ శాఖ వార్నింగ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. నగరంలో దుకాణాలన్ని రాత్రి పదిన్నర లేదా 11 గంటలకే మూసేయాలంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అబద్దమంటూ హైదరాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దుకాణాలు, సంస్థలు తెరిచే, మూసేసే సమయాలు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని ఇది ప్రతి ఒక్కరు గమనించాలని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు సూచించారు.

Publisher : Swetcha Daily

Latest

PCC New President : పీసీసీ అధ్యక్షుడు ఎవరో?

- ముగిసిన అధిష్ఠానం కసరత్తు - ఏ క్షణంలోనైనా ప్రకటన - మంత్రి వర్గ...

Hyderabad : కంప్రెషర్ పేలుడు.. సీఎం దిగ్ర్భాంతి

- షాద్ నగర్‌లో విషాదం - గ్లాస్ ఫ్యాక్టరీలో పేలుడు - ఆరుగురి మృతి -...

BRS : కారు దిగిన కాలె.. నెక్స్ట్ ఎవరు..?

- గేట్లెత్తిన కాంగ్రెస్‌ పార్టీ.. మళ్లీ వలసలు షురూ - హస్తం అందుకున్న...

Revanth Reddy : 4 రోజుల్లో మార్గదర్శకాలు

- రుణమాఫీపై సీఎం కీలక ప్రకటన - త్వరలోనే మార్గదర్శకాలు - రేషన్ కార్డు...

Telangana : నిబంధనల మేరకే కమిషన్ ఏర్పాటు

- నాటి మంత్రి కోరిన మీదటే విచారణ - రూల్స్ ప్రకారమే నోటీసుల...

Don't miss

- రుణమాఫీపై సీఎం కీలక ప్రకటన - త్వరలోనే మార్గదర్శకాలు - రేషన్ కార్డు ప్రామాణికం కాదు - పీసీసీ చీఫ్ రేసులో ఎవరైనా ఉండొచ్చు - ఫిరాయింపులకు తెలంగాణ ఒక్కటే ప్రత్యేకం కాదు - ఉచిత పథకాలను తప్పుపట్టడం...

Telangana : నిబంధనల మేరకే కమిషన్ ఏర్పాటు

- నాటి మంత్రి కోరిన మీదటే విచారణ - రూల్స్ ప్రకారమే నోటీసుల జారీ - మాజీ సీఎం అభ్యంతరాల్లో వాస్తవం లేదు - జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటు సబబే - హైకోర్టులో తెలంగాణ ఏజీ సుదర్శన...

Harish Rao : కవితతో ములాఖత్

- తీహార్ జైలుకు హరీష్ రావు - కవితతో ప్రత్యేక భేటీ - యోగక్షేమాలపై ఆరా - ధైర్యంగా ఉండాలని సూచన Harish Rao Meets MLC Kavitha : లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కుని తీహార్ జైలులో...