Monday, July 1, 2024

Exclusive

PCC New President : పీసీసీ అధ్యక్షుడు ఎవరో?

– ముగిసిన అధిష్ఠానం కసరత్తు
– ఏ క్షణంలోనైనా ప్రకటన
– మంత్రి వర్గ విస్తరణపై రానున్న క్లారిటీ
– కాంగ్రెస్ నుంచి గెలిచినోళ్లకే మంత్రులుగా ఛాన్స్

AICC Exercise On PCC New President in Telangana : తెలంగాణ పీసీసీ పదవి కోసం పార్టీ అధిష్ఠానం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి కాలం గురువారంతో ముగియడంతో నూతన చీఫ్ ఎన్నికకు ఏఐసిసి కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ సీనియర్లు, మంత్రులతో ఏఐసిసి నేతలు గత రెండు రోజులుగా వరుస భేటీలు నిర్వహించారు. అయితే ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే వారికే ఈ పదవిని కట్టబెట్టాలని ఏఐసిసి భావిస్తోంది. సిఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు గత 5 రోజులుగా ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే.

పూర్తయిన వడపోత

ఈ క్రమంలో శుక్రవారం జరిగిన భేటీలో పీసీసీ కొత్త సారథిపై పార్టీ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆశావహుల్లో బీసీ వర్గం నుంచి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధు యాష్కీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపించగా, తాజాగా, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎస్టీ కోటా నుంచి మంత్రి సీతక్క, ఎస్సీ కోటాలో సంపత్ కుమార్ పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా , తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

మంత్రిపదవులపైనా క్లారిటీ

కాంగ్రెస్ బీ-ఫామ్ మీద గెలిచినోళ్లకే మంత్రి పదవులు దక్కుతాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ ఛీఫ్, కేబినెట్ విస్తరణపై నిర్ణయాలు ఒకేసారి ఫైనల్ అవుతాయన్నారు. పీసీసీ చీఫ్‌ నియామకంపై సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. టీపీసీసీ పదవిని మహిళకు ఇస్తే ఎలా ఉంటుంది? అంటూ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ‘బాగానే ఉంటుంది’ అంటూ.. ‘పీసీసీ రేసులో ఎవరైనా ఉండొచ్చు. సామాజిక న్యాయంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలు, మహిళలు ఇలా ఏ వర్గానికి చెందిన వారైనా ఉండొచ్చు’ అని బదులిచ్చారు.

Publisher : Swetcha Daily

Latest

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? -...

Survey: చదువుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా..!

Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం -...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్...

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్ - ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి...

Don't miss

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? -...

Survey: చదువుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా..!

Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం -...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్...

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్ - ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి...

Telangana: తీరు మారని ‘కాసు’పత్రులు

(జులై 1) నేడు జాతీయ వైద్యుల దినోత్సవం Private Doctors Persecution from poor patients..today National Doctors day అమ్మానాన్నలు పిల్లలకు జన్మనిస్తే ఆపదకాలంలో వైద్యులు మనకు పునర్జన్మను ఇస్తారు. ఒకప్పటి దశాబ్దాల కలరా...

Hyderabad:బ్రాండ్ ఇమేజ్ .. ‘సౌండ్’డామేజ్

నగరవాసులకు నరకం చూపిస్తున్న సౌండ్ పొల్యూషన్ శబ్దకాలుష్యంలో దేశంలోనే 5వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ నివాస ప్రాంతాల మధ్యే ఫంక్షన్ హాళ్ల నిర్వహణ డీజేలు, బ్యాండ్ మేళా సౌండ్ లతో దద్దరిల్లుతున్న...

Telangana:‘అప్పు’డే ఆ పని చేయొద్దు?

కొత్తగా అప్పులు చేయొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖకు రేవంత్ ఆదేశం బీఆర్ఎస్ చేసిన అప్పులు కాంగ్రెస్ కు చుట్టుకుంటున్న తిప్పలు నాటి సర్కార్ చేసిన అప్పులకు నెలనెలా వడ్డీలు కడుతున్న కాంగ్రెస్ ...