Tuesday, July 2, 2024

Exclusive

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

– అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు
– కొలువుల జాతర కొనసాగుతుంది
– కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి

Sama Rammohan Reddy: కాంగ్రెస్ పాలనలో కొలువుల జాతర కొనసాగుతుందని, దీనికితోడు జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలంగాణ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు భరోసాగా నిలబడిందని తెలిపారు. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరగకుండా.. పెండింగ్‌లో ఉన్న పలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తున్నదని వివరించారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించిందని ట్విట్టర్ వేదికగా ఆయన స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో పేపర్ల లీకేజీలు, రిజర్వేషన్ల వివాదాలు, ఫలితాల నిలిపివేతలు, కోర్టు కేసులు నిరుద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయని సామా రామ్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. దాదాపు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్న గ్రూప్ 1 పరీక్షను హైకోర్టు రెండు సార్లు రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణను కట్టుదిట్టం చేసిందని, గత పాలకవర్గాన్ని తప్పించి కొత్త ఛైర్మన్ ను, బోర్డు సభ్యులను నియమించిందని వివరించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి యూపీఎస్‌సీ ఛైర్మన్‌ను కలిసి జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.

గత ప్రభుత్వ హయంలో వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల పరిధిలో ప్రధాన అడ్డంకిగా మారిన కోర్టు కేసుల చిక్కుముడులన్నింటినీ ఒక్కటొక్కటిగా కొత్త ప్రభుత్వం అధిగమించిందని సామా రామ్మోహన్ రెడ్డి వివరించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మొత్తం 28,942 మందికి ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలను అందించిందని గుర్తు చేశారు. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ద్వారా మొత్తం 28,942 పోస్టులను కొత్త ప్రభుత్వం భర్తీ చేసిందని తెలిపారు. వీటిలో 15,371 పోస్టులకు పురుషులు ఎంపికయ్యారని, మిగతా 13,571 పోస్టులను మహిళలు సాధించారని పేర్కొన్నారు. మొత్తం నియామకాల్లో 53 శాతం ఉద్యోగాలకు పురుషులు ఎంపికైతే.. 47 శాతం ఉద్యోగాలను మహిళలు దక్కించుకున్నారు.

నియామకాల్లో అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలోనూ కోర్టు తీర్పులకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అనుసరించిందని, గతంలో రెండుసార్లు రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించిందని, అందుకు సంబంధించి టీజీపీఎస్సీ రేపో ఎల్లుండో ఫలితాలను వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తోందని సామా రామ్మోహన్ రెడ్డి వివరించారు. గ్రూప్ 2 పరీక్షలను షెడ్యూలు ప్రకారం ఆగస్టులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పేపర్ల లీకేజీలతో 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయని, అప్పుడు నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఒక్కటి కూడా వెల్లడి కాలేదని గుర్తు చేశారు. 581 వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు పరీక్షలు ఈ నెల 29వ తేదీతో ముగియనున్నాయని, ఎన్నడూలేని విధంగా 11,062 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించిందని, టెట్ 2024ను ప్రశాంతంగా నిర్వహించిందని వివరించారు.

Publisher : Swetcha Daily

Latest

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Don't miss

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై ఉన్న ద్వేషం.. - ఇప్పుడు హిందూ సమాజంపై విద్వేషంగా మారింది - కాంగ్రెస్ కూటమికి హిందూత్వాన్ని అవమానించడం అలవాటే - రాహుల్ అబద్ధాలను...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ - నిన్న 3035 పోస్టులతో ఆర్టీసీ నోటిఫికేషన్ - పెండింగ్ నోటిఫికేషన్లకు తొలి ప్రాధాన్యత - ఆగస్టులో మరో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి పదవికీ లాబీయింగ్ - హస్తినలోనే సీఎం రేవంత్ - కోట నీలిమ అంగీకరిస్తారా? - టీపీసీసీకి లేని సమాచారం Ex Minister Talasani Srinivas...