Fortuner Monthly EMI: ఒకప్పుడు కారు అంటే కోటీశ్వరుల వద్ద మాత్రమే దర్శనమిచ్చేది. రూ.కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నవారికి మాత్రమే కార్లను కొనుగోలు చేసే స్థోమత ఉండేది. అయితే ప్రస్తుత రోజుల్లో ఈఎంఐ పుణ్యమా అని సామాన్యులు సైతం కార్లను కొనుగోలు చేయగలుగుతున్నారు. ఒక్క రూపాయి చెల్లించకుండానే షోరూం నుంచి కారును తీసుకొచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది డ్రీమ్ కారుగా ఉన్న టొయోటా ఫార్య్చూన్ ను సొంతం చేసుకోవాలంటే నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఫార్యూన్ కారు క్రేజ్..
టొయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూన్ మోడల్ కారును చాలా మంది ఇష్టపడతారు. ఇతర కార్లతో పోలిస్తే విశాలంగా ఉండటం, ఇంటిల్లపాది ప్రయాణించడానికి సౌకర్యంగా ఉండటం ఈ కారు ప్రత్యేకతగా చెప్పవచ్చు. అందుకే సామాన్యుల నుంచి డబ్బున్నవారి వరకూ ఫార్చ్యూన్ కారును కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం మార్కెట్ లో ఈ ఫార్చ్యూన్ కారు ధర మోడల్ ను బట్టి రూ.40 – 50 లక్షలు పలుకుతోంది.
జీరో డౌన్ పేమెంట్..
ఫార్చ్యూన్ కారు ధర నగరం, రాష్ట్రాన్ని బట్టి మారుతుంటుంది. అయితే చాలా వరకూ టొయోటా షోరూంలు జీరో డౌన్ పేమెంట్ ను కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నాయి. ప్రతీ నెల ఈఎంఐ రూపంలో నగదు చెల్లించే వెసులుబాటును కల్పిస్తున్నాయి. అయితే వడ్డీ రేటు అనేది మీరు ఎంచుకునే రుణ వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. మీరు 5, 7 లేదా 8 ఏళ్ల కాలానికి ఈఎంఐ తీసుకోవాలని భావిస్తే.. ప్రతీ నెల మీరు చెల్లించే నగదు కూడా అందుకు తగ్గట్లే మారిపోతుంటుంది.
నెలకు ఎంత చెల్లించాలంటే?
ఉదాహరణకు రూ.40 లక్షల విలువైన ఫార్చ్యూన్ మోడల్ కారును ఐదేళ్ల రుణ వ్యవధితో కొనుగోలు చేస్తే నెలకు రూ. 85,000-90,000 చెల్లించాల్సి ఉంటుంది. ఏడేళ్ల కాలానికి తీసుకుంటే నెలకు రూ. 65,000 – 70,000 వరకు పడుతుంది. అదే 8 సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే మీరు నెలకు రూ.55,000 – రూ.60,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజులు, ఇన్సూరెన్స్, ఆర్టీఓ ఛార్జీలు కూడా ఈఎంఐలు కలిసే ఉండనున్నాయి.
Also Read: KTR on BC Reservations: సీఎం రేవంత్ బీసీ ద్రోహి.. తడిగుడ్డతో గొంతు కోశారు.. కేటీఆర్ ఫైర్
ఫార్చ్యూన్ కారు ఫీచర్లు
ఫార్య్చూన్ కారు పెట్రోల్, డీజిల్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. వేరియంట్ ఆధారంగా ఇది లీటర్ కు 10-14 కి.మీ మైలేజ్ ఇస్తుంది. కారు లోపలి భాగంలో స్పేషియస్ ఇంటీరియర్ తో పాటు 7 సీటర్ లే అవుట్ ఉంటుంది. సేఫ్టీ కోసం 7 సీట్లకు ఎయిర్ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. 9 అంగుళాల టచ్ స్క్రీన్, జేబీఎల్ స్పీకర్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, జీపీఎస్ నావిగేషన్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ తదితర ఫీచర్లు పార్చ్యూన్ కారులో ఉన్నాయి.
