KTR on BC Reservations: సీఎం రేవంత్ బీసీ ద్రోహి.. కేటీఆర్ ఫైర్
KTR on BC Reservations (Image Source: Twitter)
Telangana News

KTR on BC Reservations: సీఎం రేవంత్ బీసీ ద్రోహి.. తడిగుడ్డతో గొంతు కోశారు.. కేటీఆర్ ఫైర్

KTR on BC Reservations: రిజర్వేషన్ల పేరుతో అధికార కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి.. బీసీ ద్రోహిత అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీలను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోశారని అన్నారు. ఆ పార్టీకి గట్టి గుణం పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అసలు బీసీ డిక్లరేషన్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్న కేటీఆర్.. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు మోసం చేసిందని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు ఎలా రిజర్వేషన్లు కల్పిస్తారని ప్రశ్నించారు.

‘ప్రజల్లో కేసీఆర్ పాలన లోటు’

బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్.. బుధవారం వరంగల్ లో పర్యటించారు. అక్కడి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేటీఆర్ పై విధంగా స్పందించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తన నిజస్వరూపాన్ని బయటపెడుతోందని అన్నారు. కేసీఆర్ దార్శనికతకు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ పాలనను కోల్పోయిన లోటు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని కేటీఆర్ ఆన్నారు. గాడిదలను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందంటూ ఘాటుగా విమర్శించారు.

‘ఈ సీఎం.. రాష్ట్రానికి పట్టిన చీడ’

హనుమకొండలో జరగనున్న దీక్షా దివాస్ సన్నాహక సభ ద్వారా ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ తెగువ, తెగింపుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆనాడు కేసీఆర్ నిరాహార దీక్షతో యూనివర్శిటీలు యుద్ధ భూమిని తలపించాయని గుర్తుచేశారు. ఆనాడు జై తెలంగాణ అనని వ్యక్తి.. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. అవినీతి అనకొండలా, రాష్ట్రానికి పట్టిన చీడలా సీఎం రేవంత్ రెడ్డి మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: AI Shopping Tool: ఏఐ సాయంతో షాపింగ్.. పర్‌ప్లెక్సిటీ సరికొత్త టూల్.. ఇకపై మరింత సులభం!

జూబ్లీహిల్స్ ఎన్నికలపై..

ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల గురించి ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ఉపఎన్నికల దెబ్బకు సీఎం రేవంత్ గల్లీ గల్లీ తిరిగేలా చేశామని అన్నారు. అయితే జూబ్లీహిల్స్ లో మోసం చేసి గెలిచారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ద్రోహం, మోసం ఎక్కువ కాలం నిలబడదని అన్నారు. ఓరుగల్లు నుండే కాంగ్రెస్ పైన ప్రతిఘటన మెుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇంకో రెండేళ్లు ఈ ప్రభుత్వంతో ఇబ్బందులు తప్పవన్న కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Also Read: YS Jagan on AP Govt: అరటి రైతులకు అండగా జగన్.. కూటమి సర్కార్‌కు స్ట్రాంగ్ వార్నింగ్..!

Just In

01

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!

RTC Officer Died: ఆర్‌టీసీ డిప్యూటీ ఆర్‌ఎం వెంకట్ రెడ్డి పాడె మోసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి