Lemon: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మొదలయ్యాయి. మార్చి లో కూడా భానుడు తన ప్రతాపం చూపించాడు. ఇక ఏప్రిల్ మొదట నుంచే సూర్యుడు భగ భగ మండుతున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే, ఇక మేలో ఎలా ఉంటుందో అని జనాలు భయపడుతున్నారు.
వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు నిమ్మకాయ నీళ్ళను తాగుతుంటారు. ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. అయితే, ఫిబ్రవరి నెలలో రూ. 6 వేలగా ఉన్న ధర ఇప్పుడు ఏకంగా 12 వేలకు పెరిగి అందర్ని షాక్ కి గురి చేస్తుంది. వడగాలులు పెరిగే కొద్దీ ఈ రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని నిమ్మ వ్యాపారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాపూరు, తెనాలి, ఏలూరు హోల్‌సేల్ మార్కెట్లలో రోజూ 2 వేల క్వింటాళ్ల వరకు నిమ్మ బస్తాలను వేస్తున్నారు.
Also Read: SriRamaNavami Shobhayatra: హైదరాబాద్లో ప్రారంభమైన శోభాయాత్ర.. మారుమోగుతున్న శ్రీరాముని నినాదాలు
ఏపీలో మొత్తం లక్షా 20 వేల ఎకరాల్లో నిమ్మను సాగు చేస్తున్నారు. ప్రతి యేటా, 10 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. కాగా, సమ్మర్ లో దిగుబడి తగ్గి .. 4 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి వస్తుందని రైతులు చెబుతున్నారు. నీటి సదుపాయం ఉన్న తోటలకు కాపు బాగానే ఉంటుంది. ప్రస్తుతం, సూపర్ మార్కెట్లో ఒక్కో లెమన్ రూ. 6 నుంచి 10 రూపాయాల వరకు విక్రయిస్తున్నారు.
Also Read: Bird Flu in Batasingaram: ఆందోళనలో కోళ్ల ఫామ్ నిర్వాహకులు…కోట్లలో ఆస్తి.. యజమానుల ఆవేదన!
అయితే, వేసవి కాలం స్టార్టింగ్ లోనే నిమ్మ ధరలు చూసి ప్రజలు షాక్ అయ్యి భయపడుతున్నారు. ఇక, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కిలో నిమ్మకాయలు రూ.120 కు అమ్ముతున్నారు. ఒక్కో నిమ్మకాయ రూ.7 నుంచి 10 కు విక్రయిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఒక్క నిమ్మకాయ ధర రూ. 10 పైనే పలుకుతోంది. గత నాలుగు రోజుల నుంచి కిలో నిమ్మకాయలు రూ. 250 కు అమ్ముతున్నారు. దీంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నిమ్మను వెనక్కి తగ్గుతున్నారు. పిండితే రసం కూడా రాని కాయలకు ఇంత రేట్లు పెంచారంటూ కొందరు, వ్యాపారులపై మండిపడుతున్నారు.