Rama Naidu Studios (imagecredit:twitter)
ఆంధ్రప్రదేశ్

Rama Naidu Studios: వివాదాస్పదంగా రామానాయుడు స్టూడియో భూమి.. స్వాధీనానికి రంగం సిద్దమైనట్టేనా?

విశాఖపట్నం స్వేచ్ఛ: Rama Naidu Studios: వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియో భూములు వివాదాస్పదంగా మారాయి. దీంతో రంగంలోకి దిగిన కూటమి సర్కార్ ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో స్టూడియోకు నోటీసులు జారీ చేస్తున్నట్లు కలెక్టర్‌ హరేందిర ప్రసాద్ మీడియాకు తెలిపారు.

రెండు వారాలు గడువు ఇస్తామని, వారి వివరణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. కాగా, రామానాయుడు స్టూడియోకు చిత్ర నిర్మాణ పరిశ్రమ, స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వం 34 ఎకరాలకు పైగా భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ భూమిలో 15.17 ఎకరాలు హౌసింగ్‌ లేఅవుట్‌ కోసం మార్పు చేయాలని స్టూడియో యాజమాన్యం కోరింది.

Also Read: fake seeds: మోసగాళ్ల సీజన్ వచ్చేసింది..వారి కనుసన్నల్లో దందా…?

అయితే నిబంధనలకు విరుద్ధమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని అప్రయోజనం కోసం వినియోగిస్తే రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రామా నాయుడు స్టూడియోకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.

సిసోడియా ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో సురేష్ ప్రొడక్షన్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఈ నోటీసులకు సురేష్ ప్రొడక్షన్స్ స్పందించి, వివరణ ఇచ్చాక తదుపరి చర్యలకు ప్రభుత్వం దిగనుంది.

స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ