Ponguleti Srinivas Reddy: మత్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.శుక్రవారం మంత్రి కూసుమంచి లోని తన క్యాంపు కార్యాలయంలో గిరిజన మత్స్యకారులకు వలలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, న్యూ ఢిల్లీ ఆర్థిక సహాయంతో, ఖమ్మం జిల్లా మత్స్యకార గిరిజనుల అభివృద్ధి కొరకు పాలేరు మత్స్య పరిశోధన సంస్థలో 3 రోజుల శిక్షణ తో పాటు, వారి ఆర్థిక అభివృద్ధి, చేపల పట్టుబడి కోసం వలలు తదితర సామాగ్రి కలిపి ఒక్కొక్కరికి 8 వేల 500 రూపాయల విలువ చేసే సామాగ్రి చొప్పున 50 మంది గిరిజన మత్స్యకారులకు మంత్రి అందజేశారు.
Also Read: Minister Srinivas Reddy: సబ్‌స్టేషన్ల నిర్మాణంతో విద్యుత్ వాతలకు చెక్… మంత్రి పొంగులేటి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అన్ని రకాలుగా అండదండగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు అందజేశారు. దివ్యాంగ సోదరులకు గతంలోనే మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేశామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ వాహనాలు భవిష్యత్తులో అందిస్తామన్నారు.
అనంతరం కూసుమంచిలో 35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ శాఖ రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిఇ రాజు చౌహాన్, ఆపరేషన్ సర్కిల్ ఎస్ఇ ఈ. శ్రీనివాస చారి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, విద్యుత్ శాఖ డిఇ లు సిహెచ్. నాగేశ్వరరావు, హీరాలాల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు