Rupee All Time Low: కనిష్ఠస్థాయికి రూపాయి విలువ.. ప్రభావం ఎలా?
Rupee-Fall (Image source Twitter)
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

Rupee All Time Low: ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి దిగజారిన రూపాయి విలువ.. ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

Rupee All Time Low: మన దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు, మార్కెట్‌పై నమ్మకానికి ప్రతిబింబమైన రూపాయి విలువ (Rupee Value) నానాటికీ దిగజారుతోంది. ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు ప్రతికూలంగా కొనసాగుతుండడంతో రూపీ విలువ పతన పరంపర కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ (US Dollar) బలపడడం, దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోవడం, వాణిజ్య లోటు పెరిగిపోవడం, ఇలా పలు అంశాలు రూపాయి విలువ క్షీణతకు కారణమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కడం లేదు. గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు రూపాయి స్థిరత్వానికి పెద్ద సవాలుగా నిలుస్తున్న, క్రమంలో రూపాయి శుక్రవారం (నవంబర్ 21) మరో జీవితకాల కనిష్ఠ స్థాయిని (Rupee All Time Low) తాకింది.

89.45 స్థాయికి దిగజారిన రూపాయి

దేశీయ కరెన్సీ రూపాయి మరో కనిష్ఠ స్థాయి పాయింట్‌ను తాకింది. శుక్రవారం ఆరంభ ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో 89.45 కనిష్ఠ స్థాయిని రూపాయి తాకింది. మన కరెన్సీకి జీవితకాలంలో ఇదే అత్యుల్ప స్థాయి. అయితే, ఆ తర్వాత కాస్త పుంచుకొని, మెరుగుపడింది. కాగా, సెప్టెంబర్ నెల చివరిలో రూపాయి జీవితకాల అత్యుల్ప స్థాయి 88.80 లెవల్‌కు పడిపోయిందని ఆర్థిక నిపుణులు ప్రస్తావించారు. మరోసారి, శుక్రవారం ఉదయం సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయిని తాకిందని, చివరకు కాస్త కోలుకొని 89.34 వద్ద ముగిసిందని పేర్కొన్నారు.

Read Also- Delhi Blast Case: పిండి మిల్లు ఉపయోగించి, ఇంట్లోనే బాంబు తయారీ.. ఢిల్లీ పేలుడు కేసులో మరో సంచలనం వెలుగులోకి!

దెబ్బకొడుతున్న గ్లోబల్ ఒత్తిళ్లు

రూపాయి ఇంత బలహీనంగా, నిలకడ లేకుండా కొనసాగడానికి ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కారణమవుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే ఆశలు రోజురోజుకూ తగ్గిపోతుండడం, మరోవైపు, అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతుండడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అందుకే, ఆర్బీఐ ఇటీవలి రూపాయి బలోపేతానికి చర్యలు తీసుకున్నా అవి ప్రభావం చూపలేకపోతున్నాయి.

అమెరికా సుంకాల ప్రభావం!

రూపాయి పతనానికి అమెరికా సుంకాలు కూడా ఒకింత కారణమని, ఆగస్టు నెల చివరిలో భారతీయ ఎగుమతులపై విధించిన టారీఫ్‌లు ప్రభావం చూపుతున్నాయని, గత కొన్ని వారాలుగా రూపాయిపై ఈ ఒత్తిడి కొనసాగుతోందని ట్రేడింగ్ నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఏకంగా 16.5 బిలియన్ల రూపాయలను ఉపసంహరించుకున్నారని చెప్పారు. అందుకే, కరెన్సీ బలహీనంగా ఉన్న ఆసియా దేశాలలో రూపాయి కూడా ఉందని ట్రేడింగ్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కూడా జోక్యం చేసుకోవడం తగ్గించిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్బీఐ ఇదివరకు సమయానుగుణంగా చర్యలు తీసుకునేది, అది లేకపోవడం ఈసారి స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. రూపాయి పతనం మరింత వేగవంతమయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also- iBomma in SBI: ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో.. ఐబొమ్మ పైరసీ లింక్స్.. అవాక్కైన పోలీసులు!

ప్రభావాలు ఇవే!

రూపాయి విలువ అంతకంతకూ దిగజారితే దిగుమతులు ఖరీదైనవిగా మారతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, భారతదేశం ఎక్కువగా దిగుమతి చేసుకునే క్రూడాయిలు, ఎలక్ట్రానిక్స్, మెషినరీల ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావసానంగా దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడికి మరింత భారంగా మారతాయని చెబుతున్నారు. అయితే, మన దేశం నుంచి ఎగుమతి చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాలకు వస్తువులు, సేవలను ఎగుమతి చేసే కంపెనీలు లాభపడతాయి. ముఖ్యంగా, ఐటీ సర్వీసుల కంపెనీలు అదనపు లాభాలు ఆర్జిస్తాయి. డాలర్లలో వచ్చే ఆదాయాన్ని రూపాయిల్లోకి మార్చుకుంటారు కాబట్టి, విలువ పెరుగుతుంది. ఇక, రూపాయి విలువ పడిపోతే, విదేశాలలో చదువుకునే విద్యార్థులు, ఇంటర్నేషనల్ జర్నీలు మరింత ఖరీదైనవిగా మారిపోతాయి. రూపాయి బలహీనపడుతూ ఉంటే, విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs) కూడా దేశీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అదే జరిగితే స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?