OnePlus 15R Launch: భారత్‌లో OnePlus 15 లాంచ్ చేసిన వెంటనే, చైనా స్మార్ట్‌ఫోన్స్ తయారు చేసే OnePlus మరో కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే గ్లోబల్ మార్కెట్లు, అలాగే భారత మార్కెట్‌లో OnePlus 15R లాంచ్ కానుందని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. అయితే, కొన్ని రిపోర్టులు ఈ కొత్త మోడల్ చైనాలో రిలీజైన OnePlus Ace 6 రీబ్రాండెడ్ వెర్షన్ అయి ఉండవచ్చని చెబుతున్నాయి. దీంతో, 15R పై ఆసక్తి మరింత పెరిగింది.
ఒక్క మాటలో చెప్పాలంటే, OnePlus 15R ఇప్పటికే మూడు కలర్ ఆప్షన్లతో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫ్లాష్ వైట్, కంపెటిటివ్ బ్లాక్, క్విక్‌సిల్వర్ వంటి ప్రత్యేక కలర్ వెర్షన్లు అందుబాటులో ఉండనున్నట్లు తెలిసిన సమాచారం. డిజైన్ పరంగా కొత్త డిజైన్ తో మెరుస్తూ, స్పెసిఫికేషన్ల పరంగా కూడా ఈ స్మార్ట్‌ఫోన్ తన క్లాస్‌లో ప్రత్యేకతను కొనసాగించేలా కనిపిస్తోంది.
Also Read: Delhi Blast Probe: బాంబు పేలుడుకు ముందు ఉమర్ ఎక్కడ నివసించాడో కనిపెట్టిన ఇన్వెస్టిగేషన్ అధికారులు
OnePlus 15R ఒకవేళ OnePlus Ace 6 స్పెక్స్ లాగే ఉంటే, ఇందులో భారీ 6.83-అంగుళాల AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, అలాగే 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లాంటి హై-ఎండ్ ఫీచర్లు ఉండనున్నాయి. Snapdragon 8 Elite చిప్‌సెట్‌తో పాటు 16GB వరకు LPDDR5X RAM, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉండనుంది. ఫోటోగ్రఫీ lovers కోసం 50MP OIS మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉండవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా Android 16 ఆధారంగా ColorOS 16 రన్ అయ్యే అవకాశం ఉంది.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే, OnePlus 15R లో 7,800mAh భారీ బ్యాటరీ తో పాటు 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ అందించనున్నట్లు లీకులు చెబుతున్నాయి. అంతేకాదు, దీనికి IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉండనున్నట్లు తెలిసిన సమాచారం. అంటే డస్ట్, వాటర్, హై ప్రెజర్ స్ప్రేయింగ్ వంటి వాటిని కూడా తట్టుకోగల రగ్గడ్ డిజైన్ వుంటుందన్న మాట.
Also Read: Bride Murder: చీర విషయంలో ఘర్షణ.. పెళ్లికి గంట ముందు పెళ్లికూతుర్ని చంపేసిన కాబోయేవాడు
ఇక ధరలు విషయానికొస్తే, ఈ మోడల్ OnePlus Ace 6 ధరలను అనుసరించే అవకాశం ఉంది. చైనాలో ఈ ఫోన్ ధరలు CNY 2599 ( రూ.32,300) నుండి ప్రారంభమవుతాయి. మిగతా వేరియంట్ల ధరలు రూ.36,000, రూ. 38,800, రూ.42,200 వరకు ఉన్నాయి. భారత మార్కెట్‌లో కూడా ఇదే రేంజ్‌లో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
