OnePlus 15 India Launch: చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) ఈ రోజు భారత మార్కెట్లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15 (OnePlus 15) ను అధికారికంగా ఆవిష్కరించనుంది. టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఈ రాత్రి 7 గంటలకు (IST) లాంచ్ అవుతుంది. వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ నవంబర్ 13 రాత్రి 8 గంటల నుంచే అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. భారత వినియోగదారుల కోసం కొన్ని ఎక్స్‌క్లూజివ్ యాక్సెసరీస్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉంటాయని తెలుస్తుంది.
లైవ్ ఎక్కడ చూడాలి?
వన్‌ప్లస్ లవర్స్, టెక్ ఎన్థూసియాస్ట్‌లు లాంచ్ ఈవెంట్‌ను OnePlus India అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో రాత్రి 7 గంటలకు ప్రత్యక్షంగా (LIVE) వీక్షించవచ్చు. ఈ ఈవెంట్‌లో కంపెనీ ధర, కెమెరా వివరాలు, బ్యాటరీ, వేరియంట్లు, ప్రత్యేక ఆఫర్లు గురించి పూర్తి వివరాలను వెల్లడించనుంది.
OnePlus 15 (వన్‌ప్లస్ 15 ) స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ 15 లో 6.78-అంగుళాల BOE ఫ్లెక్సిబుల్ AMOLED LTPO డిస్‌ప్లే ఉంటుందని చెబుతున్నారు. ఇది 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే 100% DCI-P3 కలర్ గామట్ సపోర్ట్‌తో రంగులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 చిప్‌సెట్ ఉండబోతోందని తెలిసిన సమాచారం. ఇది అత్యాధునిక 3nm ప్రాసెస్ పై నిర్మించబడినది. దీని వలన పవర్ ఎఫిషియెన్సీ ప్రదర్శన రెండూ గణనీయంగా మెరుగుపడతాయి. ఫోన్ Android 16 ఆధారిత Oxygen OS 16 పై నడుస్తుంది. వన్‌ప్లస్ వినియోగదారులకు వేగవంతమైన, క్లీన్, సాఫ్ట్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తుంది.
కెమెరా సెటప్
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ (50MP + 50MP + 50MP) ఉండనుంది.
ప్రధాన కెమెరా Sony సెన్సార్‌తో వస్తుంది. అలాగే అల్ట్రా వైడ్ లెన్స్, 3.5x టెలిఫోటో లెన్స్ కూడా ఇవ్వబడ్డాయి.
సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా 4K వీడియో రికార్డింగ్ (60fps) ను సపోర్ట్ చేయనుంది.
Also Read: Bigg Boss promo: సుమన్ శెట్టితో స్టెప్పులేయించిన బిగ్ బాస్ మహారాణులు.. ఏంది భయ్యా ఆ టాస్కులు..
ధర & లాంచ్ ఆఫర్లు
వన్‌ప్లస్ 15 కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన నాన్-ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా ఉండబోతోందని రూమర్స్ వస్తున్నాయి. ఇది గత మోడల్ వన్‌ప్లస్ 13 ( రూ.69,999) కంటే ఎక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, లాంచ్ ఆఫర్లలో భాగంగా రూ. 4,000 వరకు ట్రేడ్-ఇన్ బెనిఫిట్, అలాగే వన్ ప్లస్ Nord Buds బండిల్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్లు నవంబర్ 13 నుంచే అందుబాటులో ఉంటాయి.
