big-boss-9( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss promo: సుమన్ శెట్టితో స్టెప్పులేయించిన బిగ్ బాస్ మహారాణులు.. ఏంది భయ్యా ఆ టాస్కులు..

Bigg Boss promo: బిగ్ బాస్ హౌస్‌లో 10వ వారం నామినేషన్స్ ప్రక్రియ ఉత్కంఠగా ముగిసిన తర్వాత, 66 రోజు ఎపిసోడ్ కోసం విడుదలైన ప్రోమో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచింది. ఈ రోజు ఎపిసోడ్ ఒక ఆసక్తికరమైన కొత్త టాస్క్‌తో ప్రారంభం కాబోతోంది. తాజాగా దీనికి సంబంధించి బిగ్ బాస్ తెలుగు ప్రోమో విడుదలైంది. ప్రస్తుతం కళ్యాణ్, దివ్య, రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్లో మహారాజు మహారాణిలుగా ఉన్నారు. వారు అక్కడ ఏం చెబితే అదే నడుస్తోంది. ఈ రోజు రాజు, మహారాణులు సుమన్ శెట్టిని పిలిపించారు. అనంతరం ఆయనతో చిరునవ్వు నవ్వమని అడిగారు. దీంతో సుమన్ శెట్టి చిరు మంద హాసం కురిపించారు. మహారాణులు చిరునవ్వు అంటే ఇది కాదు మెగాస్టార్ చిరంజీవి వీణ స్టెప్ వేస్తూ నవ్వు అంటారు. దానికి సుమన్ శెట్టి అలాగే చేస్తారు.. ఇది అంతా నవ్వుల మయంగా ఉంటుంది. ఎలాగోలా సుమన్ వేసిన స్టెప్పులు అందరినీ నవ్వించాయి. ఒక సందర్భంలో సుమన్ శెట్టి నేను వెళ్లాలి కూర మాడిపోతుంది అన్న డైలాగ్ చాల నవ్వులు పూయించింది. ఇక్కడితో సుమన్ శెట్టి పాత్ర పూర్తయింది.

Read also-Akhanda 2: ‘అఖండా 2’ ఫస్ట్ సింగిల్ కంపోజింగ్ పూర్తి.. పాట గురించి చెప్తూ ఊగిపోతున్న థమన్..

తర్వాత భరణిని రమ్మంటారు బిగ్ బాస్ హౌస్లో ని రాజు మహారాణిలు. దీంతో భరణి మహారాణుల ముందుకు వస్తాడు. చిరునవ్వు అంటే ఏమిటి అని మహారాణులు భరణిని అడుగుతారు. దానికి చిరు నవ్వు అంటే ఇలా ఉంటుంది అని భరణి చూపిస్తాడు. దానికి సమాధానంగా చిరునవ్వు అంటే స్టెప్పేస్తూ నవ్వాలి. దీనికి భరణి చిన్న స్టెప్ వేసి అక్కడి అందరినీ నవ్విస్తాడు. చిరునవ్వు అన్న ప్రతిసారీ మీరు ఇదే చెయ్యాలి అని చెప్తారు. దానికి భరణి సరే అని మరోసారి చిన్న స్టెప్ వేసి అక్కడినుంచి వెళ్తాడు. అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్లిన తర్వాత ఇమ్మానుయేల్ మా అన్నను ఏం చేశారురా అంటూ పెద్దగా అరుస్తాడు. దీనిని విన్న మహారాణులు.. ప్రజలు ఇమ్మానుయేల్ ను ఎత్తుకురండి అని ఆర్డర్ వేస్తారు. అక్కడి ఉన్న వారు ఇమ్మానుయేల్ ను ఎత్తుకుని మహారాజు మహారాణుల ముందు ప్రవేశపెడతారు.

Read also-Dharmendra health update: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెటరన్ స్టార్ ధర్మేంద్ర.. ఇంటి వద్దే చికిత్స..

అనంతరం అక్కడ ఉన్న మహారాజు మహారాణులు ఇమ్మానుయేల్ ను ముటామేస్త్రి లో మెగాస్టార్ స్టెప్ వేయమంటారు. కండిషన్ ఏంటంటే లుంగీ పైకి ఎత్తకూడదు అంటారు. దానికి సరే అన్న ఇమ్మానుయేల్ స్టెప్ వేస్తాడు. ఈ సీన్ అక్కడ అందరినీ నవ్విస్తుంది. చిరునవ్వ అన్నప్పుడు అల్లా ఇదే స్టెప్ వెయ్యాలి అని చెప్తారు. దీనికి ఇమ్మానుయేల్ సరే అంటాడు. అనంతరం ప్రోగ్రామ్ మొత్తం టాస్క మోడ్ లోకి వెళ్లిపోతుంది. అక్కడ ఉన్న ప్రజలకు కమేండర్ అయ్యేలా టాస్క్ ఒకటి ఇస్తారు. ఈ టీస్క్ లో ప్రజలు కమెండర్స్ గా మారవచ్చు. కమెండర్స్ తమ స్థానాన్ని కాపాడుకోవచ్చు. దీని పేరు నిలబెట్టు, పడగొట్టు,గెలుపొందు. ఇది ఆడే సమయంలో ఏం జరుగుతుంతో అన్నది తెలియాలంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే.

Just In

01

Chiranjeevi in Spirit: ‘స్పిరిట్’లో మెగాస్టార్ కామియోపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి.. కానీ చిరుతో..

Vakiti Srihari: మత్స్య కారుల అభివృద్ధికి కృషి.. రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించాం.. మంత్రి వాకిటి శ్రీహరి

Tollywood movie budget: టాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం బడ్జెట్ పెరుగుతూ వస్తుంది.. దీనికి కారణం ఏంటంటే?

Al Falah University: ఉగ్రవాదులకు అడ్డా అంటూ ఆరోపణలు.. స్పందించిన అల్‌-ఫలాహ్‌ యూనివర్శిటీ

Movie budget: సినిమాలకు పెట్టిన బడ్జెట్ నిజంగా అంత అవుతుందా.. ఎందుకు అలా చెప్తారు?