akhanda-2( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Akhanda 2: ‘అఖండా 2’ ఫస్ట్ సింగిల్ కంపోజింగ్ పూర్తి.. పాట గురించి చెప్తూ ఊగిపోతున్న థమన్..

Akhanda 2: బాలయ్య బాబు ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ 2’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొదటి సింగిల్ నవంబర్ 14 న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన అప్టేట్ చూస్తుంటే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా కనిపిస్తుంది. థమన్ అఖండ 2 తాండవం నుంచి వచ్చే పాట గురించి వివరిస్తూ.. ‘మొదటి సింగిల్ ఇప్పుడే మిక్సింగ్ పూర్తయింది. ఆ పాటను చేస్తున్నంత సేపు నిద్ర రావడం లేదు. అంతా శివుని దయ, ఈ పాటకు మ్యూజిక్ ఎంత హైప్ లో ఇచ్చినా సరిపోవడం లేదు. నా మాగ్జిమమ్ ఇచ్చేశాను. ఈ పాట స్పెషల్ ఏంటి అంటే.. శంకర్ మహదేవన్, కైలాశ్ ఖేర్ ఇద్దరు కలిపి పాడారు. ఇది విన్న నాకే నిద్ర పట్టడం లేదు. వచ్చాకా ఎలా ఉంటుందో చెప్పలేను. బోయపాటి, బాలయ్య మొత్తం ఇచ్చేస్తారు. ఈ పాటకు ఎంత రిధమ్ వేసినా సరిపోవడం లేదు. ప్రస్తుతానికి ఇడియామేటిక్ గా పూర్తి చేశాం. నవంబర్ 14 న అందరూ రెడీగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ పాట ఎలా ఉండబోతుందో చూడాలంటే వేచి ఉండాల్సిందే.

Read also-Govinda hospitalized: ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా.. ఆది జరిగిన తర్వాత రోజే..

నటసింహం నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న సంచలన చిత్రం ‘అఖండ 2: తాండవం’. వీరి కాంబినేషన్ అంటేనే అభిమానులకు గూస్‌బంప్స్. మొదటి భాగం ‘అఖండ’ సాధించిన ఘన విజయం తర్వాత, ఈ సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచుతూ, చిత్ర యూనిట్ ఇటీవలే సినిమాలోని మొదటి పాట ‘ది తాండవం’ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో విడుదలతోనే అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. టైటిల్‌కు తగ్గట్టుగానే, ఇది శివ తాండవం చుట్టూ అల్లుకున్న శక్తివంతమైన భక్తిభరితమైన పాట. ప్రోమోలో బాలకృష్ణ మరోసారి తన పవర్-ప్యాక్డ్ అఘోరా అవతార్‌లో కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. మంచు పర్వతాల మధ్య, భారీ శివాలయం సెట్టింగ్‌లో, ఒంటి నిండా విభూతి ధరించి, రౌద్రమైన కళ్లతో శివ తాండవం చేస్తుంటే ఆ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

Read also-Nagarjuna: వారికి కూడా ఆ సత్తా లేదంటున్న కింగ్ నాగార్జున.. ఎందుకంటే?

ఈ పాటకు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందించారు. ‘అఖండ’ విజయానికి థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టైటిల్ సాంగ్ ఎంత కీలకమో అందరికీ తెలుసు. అదే స్థాయిలో, ‘ది తాండవం’ ప్రోమోలో వినిపించిన బీట్స్, డ్రమ్స్ ఇంటెన్స్ రిథమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ తాండవానికి థమన్ ఇచ్చిన సంగీతం, భక్తిభావానికి, రౌద్రానికి సరిగ్గా సరిపోయేలా ఉంది. ఈ పాటను అగ్రశ్రేణి గాయకులు శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్ ఆలపించారు. వారిద్దరి డైనమిక్ వాయిస్‌లు ఈ మాస్ డివోషనల్ ట్రాక్‌కు మరింత ఊపునిచ్చాయి. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం అందించారు. ప్రోమోలో వినిపించిన “అఖండ తాండవం.. హరహర మహాదేవ” అనే లైన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. మరి ఫల్ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే నవంబర్ 14 ఆగాల్సిందే.

Just In

01

BIBINagar Lake: ఆత్మహత్యలకు కేరాఫ్‌గా మారిన ఓ చెరువు.. ఎక్కడో తెలుసా..!

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. 2029 నాటికి ప్రతీ ఒక్కరికి సొంతిల్లు!

Bigg Boss promo: సుమన్ శెట్టితో స్టెప్పులేయించిన బిగ్ బాస్ మహారాణులు.. ఏంది భయ్యా ఆ టాస్కులు..

MLC Kavitha: జగదీష్ రెడ్డి పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్​: రూ.900 కోట్ల భూ వ్యవహారంపై కలెక్టర్ ఫోకస్..!