OnePlus 13R: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేసి నట్లయితే.. ఇదే మంచి సమయం. ఇండియాలో OnePlus 15R అధికారిక లాంచ్‌కు ముందే మార్కెట్‌లో మంచి హైప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే పాపులర్ అయిన OnePlus 13R (12GB+256GB) మోడల్‌కు ఫ్లిప్ కార్ట్ ( Flipkart ) లో తాజా ధర తగ్గింపు రావడం కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. పవర్‌ఫుల్ పనితీరు కావాలన్నా, లేదా వాల్యూ-ఫర్-మనీ ఫోన్ కోసం వెతుకుతున్నా.. ఈ డీల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే తీసుకునే మంచి అవకాశాన్ని అందిస్తోంది.
OnePlus 13R మొదట భారత్‌లో రూ.42,999 ధరతో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ( Flipkart) లో ఇది రూ.38,514కి వస్తోంది. అంటే రూ. 3,525 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ తో వస్తోంది. అదనంగా, Flipkart SBI క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తే 5% క్యాష్‌బ్యాక్‌తో ( అంటే గరిష్టంగా రూ.4,000) ధరను రూ.34,514 వరకు తగ్గించుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ఉపయోగిస్తే, మీ పాత ఫోన్ మోడల్, పరిస్థితిపై ఆధారపడి ధరను ఇంకా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇందులో గరిష్టంగా రూ.31,800 వరకు తగ్గింపు లభిస్తుంది.
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, వన్ ప్లస్ 13R (OnePlus 13R) లో 6.77-అంగుళాల 1.5K ProXDR LTPO డిస్‌ప్లే, 2780×1264 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, Adreno 750 GPU ఉండడంతో పనితీరు మరింత స్మూత్‌గా ఉంటుంది. 6,000mAh బ్యాటరీతో పాటు 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉంది. కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్ (2X ఆప్టికల్ జూమ్), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫోన్ Astral Trail, Nebula Noir (ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నాయర్) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.
OxygenOS 15 (Android 15 ఆధారంగా) పనిచేసే ఈ డివైస్ 4 సంవత్సరాల Android అప్‌డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తుంది. అంతేకాకుండా, Wi-Fi 7, NFC, ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అలర్ట్ స్లైడర్, IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా, ప్రీమియం వన్ ప్లస్ ( OnePlus ) ఫోన్‌ను తక్కువ ధరలో కొనాలనుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ మొబైల్.

