Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ వ్యాపార వేత్తలను బెదిరిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికీ ప్రభుత్వంలో ఉన్నట్లు ఆయన ఫీలవుతున్నాడని ఎంపీ మండిపడ్డారు. ఎంపీ గాంధీభవన్ లో మాట్లాడుతూ పచ్చ కామెర్లు వచ్చినోళ్లందరికీ లోకం పచ్చగానే కనిపించినట్లు కేటీఆర్ చేసిన తప్పులు తరహాలోనే మిగతా వాళ్లు చేస్తారని ఆయన భ్రమ పడుతున్నారని ఎంపీ విమర్శించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఫామ్ హౌజ్ పాలన తప్పా ప్రజలకు ఏమీ కనిపించలేదన్నారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: నవీన్ యాదవ్ ర్యాలీ చూసి బీఆర్ఎస్ కు దడ.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు
ప్రజా ప్రభుత్వలో అందరికీ స్వేచ్ఛ
తమ ప్రభుత్వంలో కేబినెట్ లో అన్నినిర్ణయాలు జరుగుతాయని కేటీఆర్ అంగీకరించారన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబాన్ని బ్లేమ్ చేయడం కోసం కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని వెల్లడించారు. గతంలో కేసీఆర్ కుటుంబ పాలన జరిగేదని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వలో అందరికీ స్వేచ్ఛ లభిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం నుంచి ప్రభుత్వ పదవుల్లో ఎవరూ లేరన్నారు. గతంలో ఇంట్లో ఉన్నోళ్లందరికీ పదవులు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ దన్నారు. పదేళ్లు ఏం చేశారని, ఇప్పుడు కేటీఆర్ తమ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తప్పులు వెతుకుతున్నారని గుర్తు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఓడగొట్టినా కేటీఆర్ కు ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: ఇంట్లో ఈటెల రాజేందర్ రెడ్డి.. గేట్ బయట ఓబీసీ నాయకుడు!
