Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు డిసెంబర్ 19న దాదాపు 10 శాతం వరకు ఎగబాకాయి. కంపెనీ ప్రమోటర్, సీఈవో భవిష్ అగ్గర్వాల్ తన వ్యక్తిగత షేర్‌హోల్డింగ్‌లోని కొంత భాగాన్ని విక్రయించి రూ.260 కోట్ల ప్రమోటర్ స్థాయి రుణాన్ని పూర్తిగా తీర్చినట్లు ప్రకటించడంతో మార్కెట్‌లో సానుకూల స్పందన కనిపించింది.
Also Read: Bondi Beach Incident: బోండీ బీచ్ ఉగ్రదాడి నేపథ్యంలో.. నడిరోడ్డుపై సిడ్నీ పోలీసుల మెరుపు ఆపరేషన్
శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర రూ.34.38 వరకు చేరుకుంది. వరుసగా మూడు సెషన్లలో నష్టాలు ఎదుర్కొన్న తర్వాత ఈ స్టాక్ మళ్లీ పుంజుకోవడం గమనార్హం. డిసెంబర్ 18 న సాయంత్రం స్టాక్ ఎక్స్చేంజ్‌కు ఇచ్చిన ప్రకటనలో, భవిష్ అగ్గర్వాల్ తన స్టేక్‌లో కొంత భాగాన్ని విక్రయించి దాదాపు రూ.260 కోట్ల ప్రమోటర్-లెవల్ లోన్‌ను పూర్తిగా చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ చర్యతో రుణానికి గాను మొత్తం 3.93 శాతం షేర్లపై ఉన్న అన్ని ప్రమోటర్ ప్లెడ్జ్‌లు పూర్తిగా తొలగిపోయాయని తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత కూడా ప్రమోటర్ గ్రూప్ ఓలా ఎలక్ట్రిక్‌లో 34.6 శాతం వాటాను కొనసాగిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ప్రమోటర్ నియంత్రణలో ఎలాంటి తగ్గుదల లేదని, దీర్ఘకాలిక వ్యూహం, కార్యకలాపాలు, పనితీరుపై ఈ నిర్ణయం ప్రభావం చూపదని పేర్కొంది. ఇది పూర్తిగా భవిష్ అగ్గర్వాల్ వ్యక్తిగత స్థాయిలో ముందే ప్లాన్ చేసిన చర్య అని వెల్లడించింది.
స్టాక్ పతనం నుంచి రికవరీ
గత కొన్ని రోజుల్లో భవిష్ అగ్గర్వాల్ స్టేక్ విక్రయాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే స్టాక్ దాదాపు 17 శాతం పడిపోయింది. డిసెంబర్ 18న షేర్ ధర రూ.30.76కి చేరి ఆల్‌టైమ్ లో స్థాయిని తాకింది. గతేడాది ఆగస్టు 20న నమోదైన రూ.157.40 రికార్డు ధరతో పోలిస్తే, ఈ స్టాక్ ఇప్పటివరకు 80 శాతం కంటే ఎక్కువగా నష్టపోయింది.
Also Read: Kingfisher – ED: కింగ్‌ఫిషర్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం.. మాజీ ఉద్యోగులకు రూ.300 కోట్ల నిధులు విడుదల
భారీ ట్రేడింగ్ వాల్యూమ్
శుక్రవారం ఉదయం 11:02 గంటల వరకు 1.94 కోట్లకు పైగా షేర్లు ట్రేడ్ అయ్యాయి. ఇది గత 30 రోజుల సగటు ట్రేడింగ్ వాల్యూమ్‌తో పోలిస్తే దాదాపు 4.8 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. గురువారం భవిష్ అగ్గర్వాల్ బల్క్ డీల్ ద్వారా కంపెనీలో 0.6 శాతం వాటాను రూ.90.28 కోట్లకు విక్రయించారు. ఒక్కో షేర్‌ను రూ.31.90 ధరకు విక్రయించగా, ఇది బుధవారం క్లోజింగ్ ధర కంటే సుమారు 3 శాతం తక్కువ.
ప్రమోటర్ ఉద్దేశ్యం ఇదే..
డిసెంబర్ 16న స్టాక్ ఎక్స్చేంజ్‌లకు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇది ఒకే సారి చేసిన పరిమిత స్టేక్ మోనిటైజేషన్ మాత్రమేనని భవిష్ అగ్గర్వాల్ తెలిపారు. ప్రమోటర్ ప్లెడ్జ్‌లు ఉండటం వల్ల అనవసర రిస్క్ పెరుగుతుందని, అందుకే పూర్తిగా జీరో ప్లెడ్జ్ మోడల్‌లో కంపెనీ పనిచేయాలన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

