Trolls On Gold Price: గత కొన్ని రోజుల నుంచి బంగారం ట్రెండింగ్ లో ఉంది. గోల్డ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా తెగ వైరల్ అవుతుంది.తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి (Gold Rate ) ఇచ్చినంత విలువ దేనికి ఇవ్వరు. ముఖ్యంగా, మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఇక, ఏదైనా ఫంక్షన్ జరిగితే చాలు.. మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ వారే హైలెట్ గా నిలుస్తారు.
Also Read: Police Vs Maoist: తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న అటవీ ప్రాంతం.. సరిహద్దు ప్రాంతాల అలర్ట్!
అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక, ఈ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. గతేడాదిలో కూడా గోల్డ్ రేట్స్ కొండెక్కి కూర్చొన్నాయి. కొత్త ఏడాది నుంచి అయిన ధరలు తగ్గుతాయని సామాన్యులు ఎంతో ఆశపడ్డారు. కానీ, ఈ ఏడాదే 10 గ్రాముల బంగారం లక్షకు చేరుకొని ఆల్ టైం రికార్డు కు చేరింది. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి. పెరిగిన ధరలను చూసి ట్రోలర్స్ ఏకంగా పాటనే క్రియోట్ చేశారు. ప్రస్తుతం, ఈ పాటకి సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Also Read: Case on MLA Kaushik Reddy: చంపేస్తానంటూ బెదిరింపులు.. పాడి కౌషిక్ రెడ్డిపై కేసు నమోదు
వాస్తవానికి ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో రూ. 5000 పెరగడం సహజం. కానీ, లక్షకు పెరగడం ఇదే మొదటి సారి. దీన్ని ఎవరూ అంగీకరించడం లేదు. వామ్మో ఇంత రేట్లు పెరిగితే మేము ఏమైపోవాలంటూ మండిపడుతున్నారు. ఇక ట్రోలర్స్ అయితే దొరికితే సందు అనుకుని ఏకంగా బంగారానికి ట్యూన్ సెట్ చేసేశారు. వాళ్ళు షేర్ చేసిన వీడియోలో” బంగారం పాతది కొత్తది కొనలేదా .. బంగారం పాతదే కొత్తది కొనలేదు..పిల్ల పెళ్ళికి నగలు కొనలేదా కొనలేనమ్మో” అంటూ సాగే ఈ పాటను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. గోల్డ్ ను ఎలాగో కొనలేము.. కనీసం పాట అయిన సంతృప్తి పడదాం అని కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు