Aghori Arrest (Image Source: Twitter)
తెలంగాణ

Lady Aghori Arrested: అఘోరీకి బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. ఎందుకంటే?

Lady Aghori Arrested: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ (Lady Aghori) గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. శ్రీవర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్న అఘోరీ.. ఇక తెలుగు రాష్ట్రాల్లో తాము అడుగుపెట్టమని తేల్చి చెప్పింది. దీంతో అఘోరీ వివాదం అంతా ముగిసినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో అఘోరీ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. హైదరాబాద్ పోలీసులు అఘోరీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ రాష్ట్రాల్లో సరిహద్దుల్లో అరెస్ట్
హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఇటీవల అఘోరీపై మోకిలా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పూజల పేరుతో తన వద్ద రూ.9.5 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన మోకీలా పోలీసులు.. తాజాగా అఘోరీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో లేడీ అఘోరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమతో పాటు హైదరాబాద్ కు అఘోరీని తీసుకొస్తున్నారు. రేపు మధ్యాహ్నం సిటీలోకి తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read: Rohith Vemula Act: సీఎం రేవంత్ ను కదిలించిన రాహుల్ లేఖ.. త్వరలో కొత్త చట్టం షురూ!

శ్రీవర్షిణీ పరిస్థితి ఏంటి?
ఇటీవలే అఘోరీని శ్రీవర్షిణి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై తన జీవితం అఘోరీతోనేనన్న ఆమె.. తమ జోలికి ఎవరు రావద్దని హెచ్చరించింది. వస్తే పెట్రోల్ పోసుకొని మరీ చనిపోతామని ఇద్దరూ వార్నింగ్ ఇచ్చారు. అయితే అఘోరీని అదుపులోకి తీసుకున్న మోకిలా పోలీసులు.. శ్రీవర్షిణిని సైతం తాజాగా తమతో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అఘోరీని బందిస్తే శ్రీవర్షిణి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆమె తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తుందా? లేదా అఘోరీ కోసం న్యాయ పోరాటానికి దిగుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.

మరో రెండు కేసులు పెండింగ్
ఇదిలా ఉంటే అఘోరీ మెుదటి భార్యను తానేనంటూ ఇటీవల మరో యువతి మీడియా ముందుకు వచ్చింది. శ్రీవర్షిణిని పెళ్లి చేసుకొని తనకు అన్యాయం చేసిన అఘోరీపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో మహిళా కమీషన్ ను సైతం ఆశ్రయించి తన గోడును చెప్పుకుంది. అటు ఏపీలోని మచిలీపట్నంలో అఘోరీపై ఇంకో కేసు నమోదు అయ్యింది. బీఆర్ అంబేద్కర్ ను లేడీ అఘోరీ అవమానించిందంటూ దళిత సంఘాలు పోలీసులకు కంప్లైంట్ చేశాయి.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం