Rohith Vemula Act (Image Source: Twitter)
తెలంగాణ

Rohith Vemula Act: సీఎం రేవంత్ ను కదిలించిన రాహుల్ లేఖ.. త్వరలో కొత్త చట్టం షురూ!

Rohith Vemula Act: జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ప్రస్తుతం జపాన్ పర్యటన (Japan Tour)లో ఉన్న రేవంత్ రెడ్డికి రాహుల్ నుంచి ఓ లేఖ అందింది. దానిని ఎక్స్ (Twitter) వేదికగా పంచుకున్న సీఎం.. రాహుల్ కు తనదైన శైలిలో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ లేఖ తనలో కొత్త ఆలోచనలను రేకెత్తించిందని సీఎం అన్నారు.

రాహుల్ స్ఫూర్తితో
జపాన్‌లోని హిరోషిమా చారిత్రక నగరంలో పర్యటిస్తున్న క్రమంలో ఈ లేఖను తాను చదివినట్లు సీఎం రేవంత్ (CM Revanth Reddy On Rahul Gandhi Letter) అన్నారు. అక్కడ మహత్మాగాంధీ విగ్రహం ఉన్న స్థలాన్ని సందర్శించబోతున్న క్రమంలో అదృష్టవశాత్తు రాహుల్ పంపిన లేఖ అందినట్లు చెప్పారు. మీ స్ఫూర్తిదాయకమైన పిలుపు నాకు బలంగా తాకిందన్న రేవంత్.. గర్వించతగ్గ భవిష్యత్ రూపొందించేందుకు రాహుల్ ఆలోచనలు, భావాల స్ఫూర్తితో ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు.

లేఖలో రాహుల్ ఏమన్నారంటే!
సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక సూచన చేశారు. తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని (Rohith Vemula Act) తీసుకురావాలని లేఖలో కోరారు. బీ.ఆర్ అంబేడ్కర్, రోహిత్ వేములలాగా లక్షలాది మంది ఎదుర్కొన్న కుల వివక్ష.. ఇకపై ఎవరు ఎదుర్కో కూడదని రాహుల్ అన్నారు. కుల వివక్ష కారణంగా యువకుల అర్ధాంతర మరణాలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాల్సిన అసరముందని రాహుల్ సూచించారు. ఈ తరహా వివక్షకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

గతంలోనే డిమాండ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల అంశం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివక్ష కారణంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన రాహుల్.. తాము అధికారంలోకి వస్తే రోహిత్ వేముల చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. తాజాగా సీఎం రేవంత్ కు రాసిన లేఖలో ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం.

మహాత్మాగాంధీకి నివాళులు
ప్రస్తుతం జపాన్ లోని పర్యటిస్తున్న సీఎం రేవంత్.. అక్కడ హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్ లో ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. జాతిపిత విగ్రహం ముందు పూలు చల్లి.. ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. అటు 1945 అణుబాంబు దాడి తర్వాత హిరోషిమా నగరంలో మిగిలిన ఏకైక భవంతిని సైతం సీఎం సందర్శించారు.

ఇంటర్ విద్యార్థులకు అభినందనలు
మరోవైపు ఇవాళ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులైన విద్యార్థి, విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఉన్నత చదువాలని ఆకాంక్షించారు. తద్వారా జీవితంలో గొప్పగా రాణించాలని ఆకాంక్షించారు.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?