Police Vs Maoist(image credit:AI)
తెలంగాణ

Police Vs Maoist: తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న అటవీ ప్రాంతం.. సరిహద్దు ప్రాంతాల అలర్ట్!

Police Vs Maoist: తెలంగాణ రాష్ట్రం సరిహద్దు ప్రాంతం వెంకటాపురం మండలానికి అతి సమీపంలో ఉన్న కర్రే గుట్టల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సోమవారం ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు భారీగా కర్రెగుట్టల ప్రాంతానికి చేరుకున్నారు. ఇటీవలనే ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరిష్ ఎదుట నిషేధిత మావోయిస్టు లు అధిక మొత్తంలో లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే నాలుగైదు రోజుల క్రితం కొంతమంది వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ మావోలు పోలీసులకు చిక్కినట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ నేపథ్యంలోనే పోలీసులకు చిక్కిన మావోల సమాచారంతో మావోయిస్టు లకు పోలీసులకు ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో సందర్శించిన నేపథ్యంలో ఈ కాల్పులకు ఊతం ఇస్తున్నట్లు ప్రత్యేకమైన సమాచారం ఉంది.

కర్రెగుట్టల్లో చత్తీస్గడ్ సహా మూడు రాష్ట్రాల పోలీసులు

తెలంగాణ, చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల్లో ఛత్తీస్‌గడ్ సహా మూడు రాష్ట్రాల పోలీసులు 2000 మంది వరకు మోహరించినట్లు తెలుస్తోంది. సోమవారం ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నుంచి దాదాపు 300 మందికి పైగా కర్రెగుట్టల వద్దకు చేరుకున్నట్లు సమాచారం ద్వారా తెలుస్తోంది. మావోయిస్టులకు స్వర్గ ధామమైన కర్రెగుట్టల ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు విస్తృత ఎదురుకాల్పులు జరుగుతున్నాయని తెలుస్తుంది.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ కేడర్లలో పనిచేసే మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి పునరావాసం పొందేందుకు చర్యలు జరుగుతున్నాయి. ఇందుకోసం ములుగు ఎస్పి డాక్టర్ పి శబరిష్ ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్నారు. ఇంకా వివిధ క్యాడర్లలో ఉన్నవారు జనజీవన స్రవంతిలో కలిసి ఎందుకు ముందుకు రావాలని సూచనలు చేస్తున్నారు.

అయితే ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో మావోలకు మంచి పట్టు ఉన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వివిధ సాయుధ బలగాలను రంగంలోకి దించింది. మావోలను మట్టుపెట్టి ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మావోలతో రాష్ట్రానికి వివిధ రకాల ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకొని వారిని మట్టు పెట్టేందుకు కేంద్ర సాయుధ బలగాలను రంగంలోకి దించింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులను పూర్తిస్థాయిలో ఏరివేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది.

తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న అటవీ ప్రాంతం

ఛత్తీస్‌గడ్ రాష్ట్ర పోలీసులు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్ట ల వద్ద పోలీసులు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో పచ్చని అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. కర్రెగుట్టల సరిహద్దు ప్రాంతాల ఆదివాసీలు ఎదురుకాల్పులతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంకేం జరుగుతుందోనని ఆందోళనలో పచ్చని పల్లెలు నిద్రవస్తవలు మాని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Also read: Lady Aghori Arrested: అఘోరీకి బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. ఎందుకంటే?

పోలీసులు, మావోయిస్టుల ఎదురుకాల్పుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనలో పల్లె గ్రామాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకానొక సమయంలో ఎదురు కాల్పులు జరిగే ప్రాంతం కర్రెగుట్టలు మావోయిస్టులకు స్వర్గధామం. వివిధ రకాల వసతులతో పాటు అటు ఛత్తీస్‌గడ్ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు అతి సమీపంలో ఉండే కర్రే గుట్టలు మావోలకు పెట్టిన కోటగా పేరుంది. అలాంటి మావోలను కేంద్ర ప్రభుత్వం మట్టు పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలుపరుస్తోంది.

10 ల్యాండ్ మైన్ బాంబు స్క్వాడ్ లతో విస్తృత గాలింపులు

మావోయిస్టులు కర్రెగుట్టల ప్రాంతంలో తమ రక్షణ కోసం ఏర్పాటుచేసిన ల్యాండ్ మైండ్స్ పేలి కొంతమంది మృత్యువాత చెందగా, మరి కొంతమంది తీవ్ర గాయాల పాలై మంచం పట్టారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఆమర్చిన ల్యాండ్ మైండ్స్ తనిఖీల కోసం 10 ప్రత్యేక బాంబు స్క్వాడ్ బృందాలతో విస్తృత గాలింపులను ఛత్తీస్‌గడ్ పోలీసులు చేపడుతున్నారు. ఓవైపు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరుపుతూనే మరోవైపు ల్యాండ్ మైండ్స్ తనిఖీలను చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఎట్టకేలకు ఆదివాసీలు సైతం ప్రభుత్వాలకే అనుకూలంగా తమ తమ గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా… అభివృద్ధికి అనుకూలంగా ఆదివాసి యువజన సంఘం పేరిట వాల్ పోస్టర్లను అంటిస్తున్నారు. అయితే ప్రొఫెసర్ హరగోపాల్ మావోయిస్టులకు పోలీసులకు జరుగుతున్న కాల్పులను నిలిపివేయాలని కోరుతున్నారు. ఈ కాల్పుల్లో ఇప్పటికే ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.

 

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం