Moto ( Image Source: Twitter)
బిజినెస్

Moto G57 Launch: మోటో నుంచి కొత్త ఫోన్ లాంచ్.. 7,000mAh భారీ బ్యాటరీతో సూపర్ మోడల్

Moto G57 Launch: ప్రస్తుతం, టెక్నాలజీ వేగంగా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే, రోజు రోజుకి కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇక టెక్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మన మార్కెట్లోకి వచ్చే మోడల్స్ ఎక్కువే అని చెప్పుకోవాలి. ఐ ఫోన్స్ నుంచి చైనా ఫోన్స్ వరకు ఇస్తరాకులు అమ్ముడు పోయినట్లు పోతున్నాయి. ఇక పెద్ద కంపెనీలు కూడా వినియోగదారుల కోసం కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అయితే, తాజాగా లెనోవో ఆధీనంలోని మోటరోలా సంస్థ అంతర్జాతీయ మార్కెట్లో Moto G57 Power, Moto G57 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేలా ఈ రెండు ఫోన్లను మన ముందుకు తీసుకొచ్చారు. పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లతో ఆకట్టుకుంటున్నాయి.

భారీ బ్యాటరీలతో రెండు మోడల్స్

మోటో జీ57 పవర్ – 7,000mAh భారీ బ్యాటరీ

మోటో G57 – 5,200mAh బ్యాటరీ

రెండింటిలోనూ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. పవర్ వేరియంట్ ఒకే చార్జ్‌తో 60 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

Also Read: Nizamabad MLA PA: ఆ జిల్లాలో నోటీసుల కలకలం. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఎమ్మెల్యే పీఏగా చేయడం ఏంటి?

ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

డిస్‌ప్లే: 6.72 అంగుళాల Full HD+ LCD (120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ బ్రైట్‌నెస్)

ప్రొటెక్షన్: Corning Gorilla Glass 7i

ప్రాసెసర్: Snapdragon 6s Gen 4 చిప్‌సెట్

రామ్/స్టోరేజ్: 8GB RAM, 256GB స్టోరేజ్ (RAM Boost ద్వారా వర్చువల్‌గా 24GB వరకు విస్తరణ)

Also Read: Telangana Road Accidents: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో చర్యలు శూన్యం.. సిబ్బంది ఉన్నా బృందాలు ఏర్పాటు చేయడంలో విఫలం

కెమెరా:

50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్

8MP అల్ట్రా వైడ్ కెమెరా

8MP ఫ్రంట్ కెమెరా

ఆడియో: స్టీరియో స్పీకర్లు, Dolby Atmos, Hi-Res ఆడియో సపోర్ట్

OS: Android 16

భద్రత: సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్

దృఢత: IP64 వాటర్ & డస్ట్ రెసిస్టెంట్, MIL-STD-810H6 సర్టిఫికేషన్

Also Read: Karimnagar Bus Accident: తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..15 మందికి తీవ్ర గాయాలు

 ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు ఎలా ఉన్నాయంటే? 

Moto G57 Power: EUR 279 (దాదాపు రూ.28,000)

యూరప్‌లో Pantone Corsair, Fluidity, Pink Lemonade కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Moto G57: EUR 249 ( రూ.25,000)

మిడిల్ ఈస్ట్ మార్కెట్‌లో త్వరలో విక్రయానికి రానుంది.

ఇతర ఫీచర్లు

రెండు ఫోన్లలోనూ డ్యూయల్ సిమ్ (Nano + eSIM) సపోర్ట్ ఉంది. Wi-Fi, Bluetooth 5.1, GPS, A-GPS, GLONASS, Galileo, QZSS, BeiDou వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

Just In

01

Memory Improvement: ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచే అద్భుతమైన హెల్త్ టిప్స్

Hydraa: నాటి నిందలే నేటి ఫలితాలు.. హైడ్రాకు జనం నీరాజనాలు

Bigg Boss Telugu: చిచ్చుపెట్టిన బిగ్ బాస్.. ఇమ్మూ, రీతూ మధ్య భారీ ఫైట్.. గొడవతో దద్దరిల్లిన హౌస్!

Air Purifier: రూ.20,000 లోపు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లు.. కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే!

Heroes turned villains: టాలీవుడ్‌లో హీరోలుగా పరిచయమై విలన్లుగా మారిన నటులు ఎవరో తెలుసా..