Karimnagar Road Accident: తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం..
Karimnagar Bus Accident (image credit:swetcha reporter)
Telangana News, నార్త్ తెలంగాణ

Karimnagar Bus Accident: తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..15 మందికి తీవ్ర గాయాలు

Karimnagar Bus Accident: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ రాజీవ్ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రేణికుంట శివారులోకి రాగానే ధాన్యం లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు బస్ లో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి.

Also Read: Chevella Bus Accident: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం ఇదే .. అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి!

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి

సమాచారం అందుకున్న ఎల్ ఎండి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ (Karimnagar )ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కాగా ధాన్యం లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను బస్సు ఢీ కొనడంతో ట్రాక్టర్ లో ఉన్న ధాన్యం బస్తాలు రహదారిపై చెల్లాచెదురుగా చెదిరయ్యాయి.

Also Read: Chevella Bus Accident: బస్సు ప్రమాదంలో తీవ్ర విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

Just In

01

Vivo X200T: త్వరలో భారత్ లో లాంచ్ కానున్న వివో కొత్త ఫోన్

Fake Eye Doctors: మిర్యాలగూడలో ఫేక్ కంటి డాక్టర్ల గుట్టురట్టు కలకలం.. పరారీలో ఓ ఆర్ఎంపీ.. !

Gadwal District: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థుల మనోవేదన.. అప్పులపాలై ఆగమాగం అంటూ..!

KTR: ‘సీఎం రేవంత్‌ను ఫుట్ బాల్ ఆడుకుంటా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Minister Seethakka: ఉపాధి హామీ చట్టంపై కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలి: మంత్రి సీతక్క