Mahindra BE Rall-E: మహీంద్రా తన కొత్త BE Rall-E ఆఫ్-రోడ్ ఎలక్ట్రిక్ SUVకి ప్రొడక్షన్ రెడీ టీజర్‌ను విడుదల చేసింది. నవంబర్ 26, 2025న ఈ కారును అధికారికంగా అన్‌వీల్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇదే ఈవెంట్‌లో కొత్త Mahindra XEV 9S కూడా బయటకు రానుంది. తాజాగా వచ్చిన టీజర్‌లో BE Rall-E ఎలా ఉండబోతోందో ఒక క్లియర్ ఐడియా ఇచ్చారు. రౌండ్ LED ప్రొజెక్టర్ లైట్లు, కాస్త స్పోర్టీగా కనిపించే స్లోపింగ్ రూఫ్‌లైన్ ఇవన్నీ కాన్సెప్ట్ మోడల్‌లానే ఉన్నాయి. అయితే eyebrow లాంటి DRLs, ఎత్తుగా కనిపించే బోనెట్ మాత్రం BE 6 స్టైల్‌ను గుర్తుకు తెస్తాయి.
Also Read: VC Sajjanar: సినీ ప్రముఖులతో కలిసి ప్రెస్‌మీట్ ఏంటి? సామాన్యులతో ఇలా ఎప్పుడైనా మీడియాతో మాట్లాడారా?
కాన్సెప్ట్‌తో పోలిస్తే పెద్ద మార్పు వీల్స్ దగ్గర కనిపిస్తోంది. అప్పట్లో ఉన్న ఆఫ్-రోడ్ టైర్లు, రూఫ్ మీద ఉండే క్యారియర్ ఇవన్నీ పోయి, ఇప్పుడు స్టార్ డిజైన్‌తో ఉన్న ఎయిరో అలాయ్ వీల్స్ వచ్చాయి. దీని వల్ల కార్ లుక్ కాస్త మోడరన్‌గా మారింది. వెనుక భాగంలో చిన్న రూఫ్ స్పాయిలర్, LED లైట్ బార్, మహీంద్రా ఎలక్ట్రిక్ లోగో.. ఇవన్నీ SUVకి స్పోర్టీ టచ్ ఇస్తున్నాయి.
ఇంటీరియర్‌ను ఇంకా మహీంద్రా బయటపెట్టలేదుగానీ, BE 6 లాగా twin-screen సెటప్, రెండు spokes ఉన్న steering wheel, BE లోగో లైటింగ్—all ఇవన్నీ వచ్చే అవకాశాలే ఎక్కువ. ఫీచర్ల విషయానికి వస్తే.. AR హెడ్-అప్ డిస్ప్లే, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, ఆటో లేన్ చేంజ్, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, వెంటిలేటెడ్ సీట్లు, వెనుక AC వెంట్స్, డాల్బీ అట్మాస్‌తో హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్.. మొత్తం ఫుల్ ప్యాక్డ్ SUVగా కనిపిస్తోంది. Level 2 ADAS కూడా ఉండే అవకాశం ఉంది.
పర్ఫార్మెన్స్‌కి వస్తే BE 6లో ఉన్న 59kWh, 79kWh బ్యాటరీలనే BE Rall-E కూడా తీసుకురావచ్చు. చిన్న బ్యాటరీ 231bhp పవర్, పెద్దది 286bhp పవర్ ఇస్తుంది. టార్క్ మాత్రం రెండింటిలోనూ 380Nm. BE 6 ఒక ఛార్జ్‌తో 556 నుంచి 682km వరకు రేంజ్ ఇచ్చినట్టు చూస్తే, Rall-E కూడా సులభంగా 550km పైగా రేంజ్ ఇవ్వొచ్చు అనటంలో సందేహమే లేదు. మొత్తం మీద చూస్తే, ఈ టీజర్ తోనే BE Rall-E మహీంద్రా BE సిరీస్‌లో మరో హైలైట్‌గా మారబోతుందని స్పష్టం అవుతోంది.

