LIC Jeevan Umang Scheme: సాధారణంగా ఏ మనిషి అయినా యవ్వనంలో ఉన్నప్పుడు ఎంతో చురుగ్గా పనిచేయగలుగుతాడు. తన జీవనానికి అవసరమైన డబ్బును సంపాదించుకోగలుతాడు. కానీ 60 ఏళ్ల దాటిన తర్వాత ఎవరికైనా డబ్బు సంపాదన కష్టంగా మారుతుంటుంది. అటువంటి వారి కోసం లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా (LIC)లో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. అందులో ప్రతీ నెల కొంత నగదును జమ చేయటం ద్వారా 100 ఏళ్ల వయసు వరకూ పెన్షన్ పొందవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి? అందులో పెట్టుబడి పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటీ? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పథకం
వృద్ధులు, రిటైర్మెంట్ వయసు వచ్చేవారి కోసం ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పథకం బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ కింద ఏకంగా 100 ఏళ్లకాలానికి బీమా కవరేజీ లభిస్తుంది. 90 రోజుల వయస్సు గల శిశువు నుండి 55 సంవత్సరాల వరకు ఎవరైనా ఈ స్కీమ్ లో చేరవచ్చు. నెలకు రూ.1,302 పెట్టుబడితో సంవత్సరానికి రూ.40,000 వరకు ఆదాయం పొందవచ్చు.
రూ.40,000 ఎలా పొందొచ్చంటే?
ఉదాహరణకు మీరు 30 సంవత్సరాల వయస్సులో ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పథకంలో చేరి 30 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.1,302 చెల్లించారని అనుకోండి. అప్పుడు మీరు ఏడాదికి రూ.15,600 పెట్టుబడి పెట్టగలుగుతారు. 30 సంవత్సరాల్లో మెుత్తం రూ.4.68 లక్షలు పెట్టుబడి పెడతారు. మీ ప్రీమియం చెల్లింపు గడువు పూర్తయ్యాక.. ప్రతి సంవత్సరం రూ.40,000 వరకు గ్యారంటీడ్ ఇన్‌కమ్ అందుతుంది. ఈ ఆదాయం మీ 100 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగుతుంది. అంటే మీరు 30 ఏళ్ల వయస్సులో ఈ పాలసీని తీసుకుని 100 సంవత్సరాల వయస్సు వరకు జీవిస్తే.. మొత్తం రూ.27.60 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.
Also Read: Strange Incident: నా భార్య ఒక నాగిని.. రాత్రిళ్లు కాటు వేస్తోంది.. కలెక్టర్‌కు భర్త ఫిర్యాదు
జీవితాంతం రక్షణ + పన్ను మినహాయింపు
ఈ పాలసీ ద్వారా మీరు స్థిరమైన ఆదాయం మాత్రమే కాకుండా జీవితాంతం (100 ఏళ్ల వరకు) లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా పొందుతారు. ఈ పథకం కింద మీకు లభించే మొత్తం నగదు పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ (పన్ను రహితం)గా ఉంటుంది. ప్రీమియం చెల్లింపుపై ఆదాయ పన్ను చట్టంలోని 80C సెక్షన్ కింద మినహాయింపు లభిస్తుంది. మెచ్యూరిటీ మొత్తంపై 10(10D) సెక్షన్ కింద ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది.
