Strange Incident: ఉత్తర్ ప్రదేశ్ లో విచిత్రకర ఘటన చోటుచేసుకుంది. సీతాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాత్రిళ్లు తన భార్య నాగినిగా మారిపోయి కాటు వేస్తోందని ఆ వ్యక్తి పబ్లిక్ గ్రీవెన్స్ (Public Grievance Day) లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదును చూసి కలెక్టర్ సైతం ఖంగుతిన్నారు.
అసలేం జరిగిందంటే?
ఉత్తర్ ప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఎప్పటిలాగే సమాధాన్ దివస్ (పబ్లిక్ గ్రీవెన్స్) జరిగింది. ఈ క్రమంలో విద్యుత్ సమస్యలు, అస్తవ్యస్తమైన రోడ్లు, రేషన్ కార్డులు ఇతర సమస్యల గురించి ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మహబూదాబాద్ ప్రాంతంలోని లోధ్సా గ్రామానికి చెందిన మెరాజ్ అనే వ్యక్తి కలెక్టర్ దృష్టికి వింత సమస్య తీసుకొచ్చాడు. అది విన్న కలెక్టర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
‘కాటు వేయడానికి వెంటాడుతోంది’
మెరాజ్ అనే వ్యక్తి తన భార్య గురించి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ.. ‘సర్, నా భార్య నసీమున్ రాత్రిళ్లు నాగినిగా మారి నన్ను వెంటాడుతోంది. కాటు వేయడానికి తెగ ప్రయత్నిస్తోంది. మానసికంగానూ నన్ను వేధిస్తోంది. ఏ రాత్రైనా నన్ను చంపవచ్చు. ఇప్పటికే అనేకసార్లు నన్ను చంపడానికి ప్రయత్నించింది. ప్రతీసారి లేచి తప్పించుకున్నాను’ అని వాపోయినట్లు తెలుస్తోంది.
నెటిజన్ల రియాక్షన్..
అయితే భార్యపై భర్త చేసిన ఫిర్యాదు చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ ‘ఆమె ఎవరెవరిని కాటేస్తోందో ఎవరికీ తెలియదు’ అని అన్నారు. మరొకరు సరదాగా ‘మీరు ఆమె నాగమణిని దాచేశారా?’ అని ప్రశ్నించారు. ఇంకొక యూజర్ వ్యాఖ్యానిస్తూ ‘మీరు కూడా కోబ్రా అయిపోండి.. అంతా సరిపోతుంది!’ అని చెప్పారు. ‘ఈ వ్యక్తి అదృష్టవంతుడు. తన జీవితంలో శ్రీదేవిని కనుగొన్నాడు’ అని రాశారు. 1986లో వచ్చిన ‘నాగినా’ చిత్రంలో నటి శ్రీదేవి నాగిణిగా కనిపించింది. ఆమెను గుర్తు చేస్తూ ఆ యూజర్ కామెంట్ పెట్టడం గమనార్హం.
Also Read: Rajasthan Crime: రూ.100 కోసం.. వ్యాపారవేత్త దారుణ హత్య.. జిమ్‌లో అందరూ చూస్తుండగానే..
విచారణకు ఆదేశం
మరోవైపు భర్త ఫిర్యాదును జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మెరాజ్ ఇచ్చిన కంప్లైంట్ పై విచారణ జరిపించాలని ఆయన ఆదేశించారు. సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్ (SDM), పోలీసు అధికారులను ఈ కేసును పరిశీలించాలని కోరారు. మరోవైపు పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని తెలుస్తోంది. దీన్ని మానసిక వేధింపుల కోణంలో కూడా పరిశీలిస్తున్నారని సమాచారం.
